Friday, May 16, 2014

చిన్న వయసు మావో జెడాంగ్.....ఫోటోలు

మావో జెడాంగ్ ((జననం: డిసెంబర్ 26,1893-----మరణం: సెప్టెంబర్ 9,1976) ను మావో సే టుంగ్ అని కూడా పలుకుతుంటారు. 1949 లో చైనా లో కమ్యూనిష్టు ప్రభుత్వం ఏర్పడి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపనకు మూలమైన సుధీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు మావో. అప్పటి నుండి 1976 లో మరణించే వరకు ఈయన చైనాను పరిపాలించాడు. ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావ వంతమైన వ్యక్తులలో మావో కూడా ఒకరు. మావో చైనా యొక్క సైనిక, పారిశ్రామిక, వ్యావసాయిక, మేధోపరమైన మరియు సాంస్కృతిక పరమైన అన్ని ప్రణాళికలను నియంత్రించాడు.

కమ్యూనిష్టులు చైనా లో అధికారంలోకి వచ్చిన తరువాత మావో ప్రపంచమంతటా సుపరిచితుడు అయ్యాడు. చైనా లో పిన్నలు, పెద్దలు ఆయన నినాదాలను మరియు ఆయన రచనలను అధ్యయనం చేసారు. గెరిల్లా యుద్ధం మరియు సామ్యవాద విప్లవాలలో రైతాంగం యొక్క పాత్ర మొదలైన అంశాల గురించి ఆయన రచనలు చైనా వెలుపల చాలా ప్రభావం చూపాయి. మావో ఒక కవి కూడా.

1960వ దశకం మధ్యలో చైనా దౌత్యపరమైన అనేక అపజయాలను చవిచూసింది. మావో ఈ సమయంలోనే విప్లవ స్పూర్తిని నిలిపి ఉంచుటకొరకు సంస్కరణ వాదులకు వ్యతిరేకంగా సాంస్కృతిక విప్లవానికి(1966-69)పిలుపునిచ్చాడు. పాత ఆచారాలు, పాత అలవాట్లు, పాత సంస్కృతి మరియు పాత ఆలోచనా విధానాన్ని తుదముట్టించుట ఈ విప్లవ లక్ష్యంగా చెప్పబడింది.

1970 వ దశకం ప్రారంభంలో చైనా పశ్చిమ దేశాలతో తన సంబంధాలను మెరుగు పరచుకున్నది. మావో 1976 సెప్టెంబర్‌లో మరణించాడు. ఆయన మరనానంతరం ఆయనకు విగ్రహ ఏర్పాట్లు చేసేరు. మామూలుగా వయసుమళ్లిన ఆకారంలోనే విగ్రహాలు ఉంటాయి.అయితే ఆయన చిన్న నాటి విగ్రహాన్ని ఎన్నుకున్నారు ఈ గ్రామ ప్రజలు ఎందుకంటే ఆ వయసులోనే ఈయన ఆ గ్రామ ప్రజలను విప్లవ స్పూర్తి గావించేరు.


No comments:

Post a Comment