Thursday, May 29, 2014

చదువు ఎందుకు చాలా ముఖ్యం....ఫోటోలు

ఈ రోజు పుస్తాకులు లేని జీవితం, స్కూళ్లు లేని ప్రపంచం చూడలేము. మేలుకున్న దగ్గర నుండి మళ్లీ నిద్ర పోయేవరకు మన నడవడికలకు చదువు ఎంతో ఉపయోగపడుతుంది. చదువు పాత జ్ఞాపకాలని పదిలపరుచుకునే దగ్గర నుండి భవిష్యత్తును సంరక్షించుకునేతవరకు మనల్ని ఆలోచింపజేస్తుంది.

వంచించబడటాన్ని అడ్డగిస్తుంది.......చదువుకున్న వారిలో ఎక్కువగా వంచించబడేవారు తక్కువగా ఉంటారు. చదువుకున్న వారిని అంత త్వరగా ఎవరూ మోసగించలేరు.

విశ్వాసమును పెంచి మీరు చెప్పేది వినేటట్లు చేస్తుంది:......ఈ రోజుల్లో చదువుకోని వారు ఏమి చెప్పినా ఎవరూ వినిపించుకోరు. కానీ మీ పేరు ముందు డా. కానీ ప్రొఫ్. కానీ లేక మీ పేరు వెనుక డిగ్రీలు గానీ ఉంటే మీరు చెప్పేది అందరూ వింటారు.

వ్యవసాయం,కళ,సంస్కృతి మరియూ వనరులను బద్ర పరుస్తుంది......చదువుకున్న వారు వనరులను ఎలా కాపాడుకోవాలో, బద్రపరుచుకోవాలో ఖచ్చిత అంచనా వేయగలరు.అలాగే సాంప్రదాయాన్నీ మరియూ కళను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ఆలోచనలు చేయగలరు.

శాంతి మరియూ ఐకమత్యము ను కాపాడగలరు.....నైతిక విలువలు మరియూ క్రమశిక్షణ లేక శాంతిబద్రతలకూ, ఐకమత్యానికి ఎందరో కళంకం తీసుకువస్తున్నారు. చదువుకున్నవారు వీటిని కాపాడగలరు.

అవగాహన మరియూ తెలివి, జ్ఞానము ను పెంచుతుంది:.....చదువుకున్నవారు ప్రతి విషయాన్నీ అవగాహాన చేసుకుని అభివ్రుద్దికి తోడ్పడుతారు.

కొత్తకల్పనలు మరియూ ఆవిష్కరణలు.....ఒకప్పుడు ఎగిరే పక్షులను చూసి మనం అసలు గాలిలో ఎగరగలమా అనే ఆలోచనలో ఉండేవాల్లం. విదేశాలకు వెళ్లడం, కొండలు ఎక్కడం, చంద్రమండాలనికి వెళ్లడం లాంటివే కాకుండా అంతర్జాలం లాంటి ఎన్నో కొత్త కల్పనలను అనుభవిస్తూ ఆడంబరపూర్వ జీవితాన్ని గడుపుతున్నాము. చదువేలేకపోతే ఇవన్ని సాధ్యమా? కొత్తకల్పనలు మరియూ ఆవిష్కరణలకూ చదువు ఎంతో ముఖ్యం. మానవ శరీరం గురించి మరియూ మన విశ్వము గురించి ఎన్నో తెలుసోకలిగేము. దీనికి కారణం చదువే.

ఆరోగ్యము.....అతిసారము ఇప్పుడు ఒక మామూలు చిన్న వ్యాధిగా చెబుతూ, అది ప్రాణాంతకమైనది కాదని తేల్చి చెబుతున్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం అదొక అంటు వ్యాధి. మందులూ, టీకాలు లాంటివి కనిబెట్టి మానవ ఆరోగ్యమునకు సేవలు అందిస్తున్నారు.

ఆర్థిక శ్రేయస్సు.....ఏ దేశములోనైనా వయసువచ్చినవారిలో కనీసం 40 శాతం చదువుకున్న వారు లేకపోతే ఆ దేశం ఆర్థికంగా అభివ్రుద్ది చెందదని చరిత్ర చెబుతోంది. వయసువచ్చినవారిలో 100 శాతం చదువుకున్న వారు ఉండే దేశాలైన ఫిన్ లాండ్, ఆస్ట్రేలియా,జపాన్ మరియూ అమెరికా ఆర్థిక శ్రేయస్సు పొంది మరింత అభివ్రుద్దికి చెందుతూ ఆడంబరపూర్వక జీవితం గడుపుతున్నారు. అభివ్రుద్దికి చదువు ఎంతో ముఖ్యం అనేది వీరి నుంచి తెలుసుకోవచ్చు.

అవకాశాలకు ప్రపంచాన్ని వెతుకుతారు....ఎక్కడ ఏ వనరులు ఉన్నాయో, అవి ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుంటారు.

ఆనందమయమైన జీవితానికి దారిచూపుతుంది......ఆనందమైన జీవితానికి కావలసినదేమిటో సరిగ్గా లెక్క కట్టలేము. కానీ చదువుకున్న కుటుంభాలు, చదువులేని కుతుంభాల కంటే ఆనందముగా జీవ్స్తున్నాయని ఒక పరిశోధనలో తేలింది.

No comments:

Post a Comment