Wednesday, May 28, 2014

అసాధారణ జంతువుల సాగుబడి భూములు....ఫోటోలు

Swansea Biopharm Leech Farm, Wales....జలగ సాగుబడి...ఆస్త్రేలియా......ఆధినిక మందులకు పనికి వచ్చే ఈ అరుదైన జలగ సాగుబడి వ్యాపారం 100 కోట్లదాకా ఉంటుందట. అంతే కాకుండా సంవత్సరానికి 60,000 జలగలను ప్రపంచవ్యాప్త వైద్య కేంద్రాలకు పంపుతున్నారట. ఈ జలగ సాగుబడి భూమిని వైద్య పరిశొధనా కేంద్రముగా కూడ చెబుతారట.

The Black Ivory Coffee Elephant Dung Farm, Thailand ....ఏనుగు లద్ది సాగుబడి భూమి,తాయ్ లాండ్......"ఏనుగు లద్ది కాఫీ పేరు విన్నారా? ఈ కాఫీ గింజల ఖరీదు కిలో 30,000 రూపాయలు....మీరు చదువుతున్నది నిజమే. ఈ కాఫీ ఎలా తయారౌతుందంటే ఏనుగులకు చిక్కుడుగింజలు తినిపిస్తారు. ఆ గింజలు కాఫీ గింజలుగా మారి ఏనుగు లద్దిలో వచ్చేస్తుంది. లద్ది నుండి వాటిని వేరుచేసి ఏనుగు లద్ది కాఫీ గింజలుగా అమ్ముతారు. అతిపెద్ద కాఫీ పొడి తయారు చేసే కంపెనీ దీనిని కొంటోందట.

Snake Ranch, Australia...కొండచిలువల సాగుబడి భూమి, ఆస్ట్రేలియా..... ఇక్కడా కొండచిలువ పాములను సాగుబడి చేస్తారు. 15 రకాల కొండచిలువలను ఇక్కడ అమ్ముతారు.

Hartley's Crocodile Adventure Farm, North Queensland ...మొసలి సాగుబడి భూమి, క్వీన్స్ లాండ్......ఇక్కడ నుండి మోసళ్లను కొనుక్కువెడతారట. ఎందుకో?

Xiongsen Tiger Mountain Village, China....పులుల సాగుబడి భూమి, చైనా.....అంతర్జాతీయ వివాదాస్పద కేంద్రముగా ప్రసిద్దిచెందిన ఈ చోటులో పులను అమ్ముతారట. కారణం పులితోలు కొసం కొనుక్కుంటారట.

Armstrong's Cricket Farm, Georgia, U.S.....కీచురాయి సాగుబడి భూమి, అమెరికా......వీటిని(కీచురాయి)ఎక్కువగ చేపల ను పట్టుకొవటానికి ఎరగా వాడుకుంటారట.

The George Town Swiftlet Farm, Malaysia...స్విఫ్ట్ లెట్ పక్షుల గూడు సాగు బడి భూమి, మలేషియా......పక్షుల గూడు సూప్ అనే ఒక సూప్ పేరు మీరు విని ఉండరు. అంతెందుకు, స్విఫ్ట్ లెట్ పక్షుల పేరు గూడా మీరు విని ఉండకపోవచ్చు. ఈ స్విఫ్ట్ లెట్ పక్షుల గూడు సాగు బడి భూమి, పట్టణ ప్రాంతాలలోని ఇళ్ళు లేని చోట ఈ పక్షులు గూడు పెట్టుకునే వాతావరణం ను కలిగించి ఉంచుతారు. ఈ పక్షులు అక్కడ గూడు కట్టుకున్న తరువాత, ఆ గూడును పక్షులతో గానీ, లేక పక్ష్ల గుడ్లతో గానీ సూప్ గా తాయారుచేసుకుని తాగుతారు. ఈ గూడులోని కొంత భాగమే ప్రపంచ ఖ్యాతి చెందిన పక్షి గూడు సూప్. కొన్ని శతాబ్ధాలుగా చినాలో ఇ సూప్ ను అత్యంత రుచికరమైన వంటగా చెప్పుకునే వారు. మలేషియాలోని జార్జ్ టౌన్ ఈ పక్షుల గూడు కు రాజధాణి. కొన్ని కోట్ల రూపాయలకు వ్యాపారం జరుగుతోంది.

The Maryland Reptile Farm, Maryland, U.S....పాకుడు జంతువుల సాగుబడి భూమి, అమెరికా......కొండచిలువలూ, నాగుపాములూ దొరుకుతాయోలేదో తెలియదు కానీ, పాకుడు జంతువులకు ప్రసిద్ది చెందినది ఈ చోటు. ఇక్కడ రకరకాల, నాణ్యమైన పాకుడు జంతువులు దొరుకుతాయని చెబుతారు.

Giraffe Ranch Farm, Florida....జిరాఫీ అశ్వవర్ధన స్థానము, ఫ్లోరీడా......ఇది మిగిలిన జంతు సాగుబడి భూముల లాంటిది కాదు. ఇక్కడ రకరకాల జిరాఫీలూ, జీబ్రాలూ, జింకలు, పందులు, ఖడ్గమృగాలూ లాంటి జంతువులు ఉంటాయి. ఈ చోటును ఒక జూ లాగా చేసేరు. ప్రజలు వచ్చి చూసి, కావాలంటే సవారి చేసి వెళ్లవచ్చు. అమ్మకాలు మాత్రం లేవు.

No comments:

Post a Comment