Thursday, May 8, 2014

మొట్టమొదటి ఆటంబాంబును పరిశోధన చేసిన చోటు.....ఫోటోలు

జూలై 16, 1945 లో మొట్టమొదటి ఆటంబాంబు పరిశోధించబడింది. ఆ పరిశోధనకు మారుపేరు "ట్రినిటీ". న్యూ మెక్సికోలోని దక్షిణ లాస్ అల్మాస్ కు 336 కిలోమీటర్ల దూరములో జోల్నడా డెల్ మ్యూర్టో అనే చోట 100 అడుగుల ఎత్తుకు నిర్మించిన గోపురము పై ప్లూటోనియం పరికరంలో నింపిన సాధనం అమర్చబడి సరిగ్గా ప్రొద్దున గం.5.30 నిమిషములకు పేల్చబడింది. 18.6 కిలో టన్నుల TNT కి సరిసమముగా విద్యుత్ శక్తి విడుదలచేయబడింది.తక్షణమే గోపురము కనబడకుండా పోయింది, ఏడారిలోని ఇసుక పచ్చటి గాజు ముక్కలుగా మారింది,ఆ విద్యుత్ శక్తి 160 కిలోమీటర్ల వరకు తరంగాలుగా వెళ్ళింది, 360 కిలోమీటర్ల దూరం వరకూ ఉన్నటువంటి కిటికీలూ, గ్లాసులు బద్దలైనాయి. పరిశోధన విజయవంతమవడంతో అమెరికా తన మిలటరిలో ఈ ఆయుధాన్ని సమకూర్చుకుంది. ఫలితం ఆగస్ట్ 6, 1945 జపాన్ దేశ హీరోషీమా నగరంపై యూరేనియం-235 పరికరాన్ని(బాంబు) వేసేరు. మిగిలినది చరిత్ర.

ఈ రోజు "ట్రినిటీ" పరిశోధనా ప్రదేశాన్ని ప్రజలు చూడటానికి సంవత్సరానికి రెండు రోజులు అనుమతి ఇస్తున్నారు. ఏప్రిల్ మరియూ అక్టోబర్ నెలలో మొదటి శనివారం. ఈ రోజుల్లో వేలకొలదిమంది ఆ ప్రదేశానికి వెళ్ళి బాంబు పరిశోధన చేసిన చోటు, పచ్చ గాజు గా మారిన ఎడారి మట్టి లాంటివాటిని చూసి వస్తున్నారు. పరిశోధనను నిర్వహించి, పర్యవేక్షించిన శాస్త్రవేత్తల, సైనికుల మరియూ ఇంజనీర్ల గుడారాలు ఇంకా అక్కడ కనబడతాయి.



ఇక్కడే పరిశోధనకు గోపురం అమర్చబడింది.


ప్లూటోనియం నింపిన పరికరంలోని ఒక భాగం


పచ్చ రంగులో మారిన ఇసుక(దీనికి ట్రినిటైట్ అని పేరు పెట్టేరు)


బాంబు పేలినప్పుడు తీసిన కలర్ ఫోటో


బాంబు పేలిన 0.016 సెకెండ్లకు


బాంబు పరిశోధనకు ఏర్పరచిన గోపురం


No comments:

Post a Comment