Saturday, May 24, 2014

పిల్లలు పుట్టుక:...అసాధారణమైన ఆచారాలు......ఫోటోలు

చైనాలో తల్లి ఇంట్లోనే ఉండాలి
చైనా ఆచారాలలో "జువో యీ జి" అనే ఒక ఆచారమున్నది. ఈ ఆచారము ప్రకారమూ బిడ్డను కన్న తల్లి 40 రోజులు బయటకు వెళ్ళకూడదు. కారణం వారు బయటకు వెడితే వ్యాధులకు గురై నీరసించిపోతారట.

బిడ్డ 6 నెలలు నేలను తాకకూడదు:
ఇండోనెషియాలోని బాలీ దీవిలో పుట్టిన బిడ్డను 6 నెలల దాకా నేల మీద ఉంచరు. బిడ్డకు 7 వ నెల వచ్చేవరకు తల్లి గాని లేక ఆమె బంధువులుగానీ బిడ్డను ఎత్తుకునే ఉండాలి. కారణం 6 నెలలలోపు బిడ్డను నేలమీద పడుకోబెడితే బిడ్డయొక్క శక్తినంతా భూమి లాగేసుకుంటుందట.

పుట్టిన బిడ్డ తలమీద కేకు జల్లుతారు:
ఐర్లాండ్లోని ప్రజలుకు జీవిత చక్రం పై ఎనలేని నమ్మకం. తల్లితండ్రుల పెళ్ళి రోజు కేకు ను కొంత బద్ర పరచి, పుట్తిన బిడ్డ పై అలా బద్రపరచిన కేకు నుండి కొంత భాగం తీసి బిడ్డపై జల్లుతారు.

పాకిస్తాన్ లో తల్లులు ఇళ్ల నుండి బయటకు వెళ్ళాలి:
బిడ్డ పుట్టబోవటానికి కొన్ని రోజుల ముందు గర్భిణీ స్త్రీ దగ్గరలోని మత సంబంధిత భవనాలలోకి వెళ్ళాలి. అక్కడి గోడల మీద కుడ్య మరియూ జంతువుల చిత్రాలు ఉంటాయి. ఈ చిత్రాలలో దేవతలు ఉంటారని, వారు పుట్టబోయే బిడ్డను ఆశీర్వదిస్తారని నమ్మకం.

ఎవరి సహాయమూ లేకుండా బిడ్డను కనాలి:
నైజీరియాలో గర్భిణీ స్త్రీలు తమ ప్రసవాన్ని తామే చేసుకోవాలి. బిడ్డ పుట్టిన తరువాతే అందరూ సహాయానికి వస్తారు.

అదృష్టము కొరకు బిడ్డను క్రింద పడేయడం:
మహారాష్ట్రం లోని కొంతమంది పుట్టిన బిడ్డలను 50 అడుగుల ఎత్తు నుండి పడేస్తారు. విస్తరింప బడ్డ పరుపుపై పడిన బిడ్డను తండ్రి పట్టుకుంటాడు.

అత్తగారు సహాయపడాలి:
వియత్నాం లో బిడ్డ పుట్టిన వెంటనే అత్తగారిని ఇంటికి పిలుచుకు వచ్చి నెల రోజులు ఉంచుకుంటారు. ఆ నెల రోజులూ అత్తగారు తల్లికి మంచి, పోషక ఆహారం వండి పెట్టాలి.

పుట్టిన బిడ్డ మీద ఉమ్మేయడం:
మొరీషియానా మరియూ దాని పక్కనున్న కొన్ని దేశాలలో బిడ్డలు మాటలను గుర్తుపెట్టుకుంటారట. అందువలన అక్కడ పుట్టిన బిడ్డపై ఆడవారు మొహం మీద, మొగవారు చెవి మీద ఉమ్మేస్తారట.

No comments:

Post a Comment