Friday, May 23, 2014

భయపెట్టు జీవసంబంధమైన ఆయుధాలు(క్రిమి యుద్ధం).....వివరణ మరియూ ఫోటోలు

ఆంత్రాక్స్.....ఆంత్రాక్స్ ఉత్పాదకకోశములు మొట్టమొదట క్రిమి యుద్ధ సాధకంగా యూనిట్ 371 అనే రహస్య పేరుతో 1930 లో జపాన్ క్వాన్ టంగ్ సైన్యం మంచూరియాలో పరిశోధించేరు. పరిశోధించిన ఆంత్రాక్స్ క్రిమిని ఏజెంట్-ఎన్ పేరుతో మొదట యుద్ద ఖైదీలపై ఉపయోగించేరు. వేలకొలది యుద్ద ఖైదీలు చనిపోయేరు. 1940 లో మిత్రరాజ్యాలు పరిశోధించేరు.

స్మాల్ పాక్స్......బ్రిటీస్ వారు దీనిని యుద్ద క్రిమి ఆయుధంగా మార్చుకుని 1754-1763 ఫ్రాన్స్ మరియూ భారత యుద్దాలలొ ఉపయోగించేరు. అయితే ఈ ఆయుదాన్ని ప్రభుత్వ అంగీకారంతో చేసేరా అన్నది తెలియలేదు.

ట్యూబర్ క్లోసిస్(టీ.బీ).....టీ.బీ క్రిములను ఉత్తర కొరియా ఉత్పత్తిచేస్తోందని అనుమానిస్తున్నారు. ప్రపంచములోనే క్రిములవలన మరణించేవారి సంఖ్యలో ఇది రెండవది.

బ్యూబోనిక్ ప్లేగు.....చైనా-జపాన్ దేశాలకు మధ్య జరిగిన రెండవసారి యుద్దములో జపనీయులు ఇది వాడేరట. 1940 లో నింగ్ బో అనే చోట ఈ క్రిములను విడుదల చేసేరట.

ఇబోలా.....ఇబోలా ఒక వైరస్ క్రిమి. ఈ రోగం సోకిందా అని కనుక్కోవడం చాలా కష్టమట. మొదట జ్వరంతో మొదలయ్యి ఎటువంటి మందులకూ తగ్గక చివరికి మనిషిని చంపుతుంది. ఇది అత్యధిక శక్తి గల వైరస్. దీనిని సోవియట్ యూనియన్ కనుగొన్నది. జపాన్ తో యుద్దములో వాడబడింది. ఇది తెలుసుకున్న జపానీయులు ఈ వైరస్ గురించిన ఆరాలు తీయడానికి రహస్య ఏజెంట్లను సోవియట్ యూనియన్ కు పంపేరట. దీనిని డా. కెన్ ఆలిబెక్ కనుగొన్నారట.

కాలరా....... రెండవ ప్రపంచ యుద్దములో జపాన్ దేశము యూనిట్-731 పేరుతో దీని పరిశోధించి, 1941 లో సుమారు 1000 చైనా బావులలో వేసేరట. ఈ నీరు త్రాగి సుమారు 10,000 మంది చైనావారు చనిపోయేరట. కానీ ఈ క్రిమి ఆయుధ పరిశోధనలో 1,700 మంది జపాన్ సిపాయులు చనిపోవడంతో ఈ పరిశోధనలలో తమ వారే చనిపోతారని మొదటిసారిగా తెలుసుకున్నారు.

చిమేరా వైరస్ లు......అణు బాంబు వేసి క్షణంలో లక్షలాది మందిని చంపడతో పాటూ నగరాలనే తుడిచిపెట్టగల ఈ శతాబ్ధములో ఈ చిమేరా వైరస్ నిదానంగా, స్లో పాయిజన్ లాగా లక్షల కొలది ప్రాణులను చంపుతుంది.

టులా రేమియా( కుందేలు జ్వరం).....ఇది జంతువుల నుండి మనుష్యులకు వ్యాపించే వ్యాధి. అయితే ఈ వ్యాధి అంత సులబంగా మనిషికి పాకదు. కానీ ఈ వ్యాధిని కుందేలు నుండి వేరుచేసి రసాయణంలో కలిపి విదజిమ్మితే మనుష్యులకు త్వరగా సోకుతుందని తెలుసుకున్న అమెరికా, బ్రిటన్, కెనడా మరియూ సోవియట్ యూనియన్ శాస్త్రవేత్తలు దీనిని ఆయుధముగా మార్చి రెండవ ప్రపంచ యుద్దములో వాడేరు.

No comments:

Post a Comment