Friday, May 16, 2014

ఇప్పటిదాకా సాఫ్ట్ వేర్ తప్పులలో ఆసక్తికరమైనవి.....ఫోటోలు మరియూ వివరణ

ఇది టెక్నాలజీ యుగం. 70 శాతం పనులు టెక్నాలజీ సహయంతోనే పనిచేస్తున్నాయి. ఈ 70 శాతంలో అతి ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. అలాంటి ఈ టెక్నాలజీకి ముఖ్య మైన ముడిసరకు సాఫ్ట్ వేర్. అలాంటి ముడిసరకులో తప్పులు దొర్లితే ఏమౌతుంది? ఊహించుకోవడం కష్టం మాత్రమే కాదు భయంగా గూడా ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా పియెర్రే ఆడోయిన్ కన్సల్ టంట్స్(Pierre Audoin Consultants (PAC)జరిపిన ఒక సర్వేలో సాఫ్ట్ వేర్ టెస్టింగ్ అతి ముఖ్యమైన రంగం. కానీ దీనిని అమలుచేయడం పూర్తిగా కొనసాగడంలేదు. సాఫ్ట్ వేర్ టెస్టింగ్ లో పూర్తి శ్రద్ద చూపనందువలన వచ్చే పర్యవసానాలు కళ్లకు కట్టినట్లుగా కనబడుతోంది. ఆ తరువాత ఆ సాఫ్ట్ వేర్ లోని తప్పును కనుగొంటున్నారు. కానీ అప్పటికే దాని వలన నష్టం జరిగిపోయుంటుంది. కనుక సాఫ్ట్ వేర్ తయారిలో ఎంత శ్రద్ద చూపుతున్నారో, దానిని విడుదల లేక అమలులో ఉంచడానికి శ్రద్దతో కూడిన టెస్టింగ్ కూడా అంతే అవసరం అని తెలియజేసింది. సాఫ్ట్ వేర్ తప్పుల వలన జరిగిన కొన్నింటిని ఇక్కడ చూద్దాం.

1)వేలాది మంది ఉద్యోగస్తులకు జీతాలు కాలయాపన: జపాన్ దేశములో ఒకే రోజున 5,600 ఏటిఏం లు 24 గంటలు పనిచేయలేదు. దీనిక్ కారణం సాఫ్ట్ వేర్ లో ఏర్పడిన తప్పు. ఈ 5,600 ఏటిఎం ల సిస్టం ను పునరుద్ధరించుటకు ఏటిఎం గ్రిడ్ నే ఆపవలసి వచ్చింది. దాని వలన ముఖ్యమైన బ్యాంకుల సుమారు 38,000 ఏటిఎం లు పనిచేయడం మానేసినై. ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా ఆగిపోయింది. 10 రోజుల తరువాత సాఫ్ట్ వేర్ తప్పును సరిచేసేరు. ఆ తరువాతే బ్యాంక్ సేవలు సరిచేయబడ్డాయి. ఒకే రోజు సుమారు 1.5 బిల్లియన్ యూరోలను బట్వాడా చేసేరు.


2)ఏటిఎం ల నుండి ఉచిత డబ్బు ప్రవాహము......ఆస్ట్రేలియా నగరాలైన సిడ్నీ, మెల్బోర్న్ మరియూ బ్రిస్బేన్ నగరాలలో ఖాతాదారులు అపరిమితమైన డబ్బును తీసుకోగలిగేరు. ఐదారు గంటలు ఇలా జరుగుతూనే ఉన్నది. డాటాబేస్ సాఫ్ట్ వేర్ లో ఏర్పడిన తప్పువలన ఏటిఎం లు స్టాండ్ బై మోడ్ లో ఉండిపోయినై. డబ్బు పరిమితికి కట్టుబడలేదు.


3)స్మార్ట్ ఫోన్ తయారుచేసే కంపెనీ డాటా లో ఏర్పడిన బ్యాక్ లాగ్:........ స్మార్ట్ ఫోన్ తాయారుచేసే ఒక కంపెనీ లో ఏర్పడిన నెట్ వర్క్ ఔటేజ్ కారణంగా లక్షలాది మందికి చేరవలసిన ఈ-మైల్ మరియూ టెక్స్ట్ మెసేజీల పంపకాలు యూరో, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియూ లాటిన్ అమెరికాలలో దెబ్బతిన్నాయి. ఏమి జరుగుతున్నదో తెలియన ప్రజలు కంగారుపడ్డారు. ఆ తరువాత ఆ కంపెనీ ఒక్క సారిగా కొన్ని కోట్ల ఈ-మైల్స్ మరియూ మెసేజీలను పంపింది.


4)గ్రీన్ కార్డ్ గెలుచుకున్న వారి తత్తరపాటు:.....గ్రీన్ కార్డ్ లాటరీలో పాల్గొన్న 20,000 మంది అత్యానందపడ్డారు. కారణం వారు పర్మనెంట్ వ్Çర్క్ పర్మిట్ దరఖాస్తుచేసుకున్న కొద్దిరోజులలోనే వారికి గ్రీన్ కార్డ్ లభించడమే. అమెరికా గ్రీన్ కార్డ్ ప్రాసస్ సాఫ్ట్ వేర్ లో ఏర్పడిన తప్పువలన గ్రీన్ కార్డ్ కు అర్హులు కాని వారికి కూడా గ్రీన్ కార్డ్ ప్రాసస్ జరిగింది. తప్పు తెలుసుకున్న సిబ్బంది ఆ తప్పును సరిచేసి, ఆ 20,000 మందికి వారికందిన గ్రీన్ కార్డ్ చెల్లదని తెలిపేరు.


5)జైళ్ళకు వెళ్లిన అమాయక ప్రజలు......ఆస్ట్రేలియా దేశములోని న్యూ సౌత్ వేల్స్ నగరంలో కంప్యూటర్ సిస్టం ల ఏర్పడిన 3,600 తప్పుల వలన 22 అమాయకులు ఖైదుచేయబడి జైలుకు పంపబడ్డరు.


6)డాటా గందరగోళం వలన ఎలెక్ట్రానిక్ టాక్స్ కార్డ్ అమలు:....జెర్మనీలో ఆటా గందరగోళం వలన సుమారు 6,00,000 మందికి తప్పుడు టాక్స్ సమాచారం పంపబడి అది గందరగోళంలో ముగిసింది. అందువలన కొత్తగా ఈ ఎలెక్ట్రానిక్ టాక్స్ కార్డ్ అమలులోకి వచ్చింది.


7)కంట్రొల్ కు తేలేని వేలకొలది కార్లను వేనక్కు తెప్పించేరు....జపాన్ డేశ్ములోని ఒక కార్లు తయారుచేసే కంపెనీ సాఫ్ట్ వేర్ సహాయముతో తయారుచేయబడ్డ కార్ల ఇంజెన్లూ, డోర్లూ సరిగ్గా పనిచేయకపోవడవలన వేలకొలది అమ్ముడుపోయిన కార్లను వెనక్కు పిలిపించుకున్నారు. ఎంత నష్టం.


8)రహస్య బ్యాంకు మరియూ ఖాతాదార్ల డాటా సౌలభ్యం:.....జర్మనీలో ఒక ట్రావల్ కంపెనీ కొత్తగా ప్రవేసపెట్టబడిన టికెట్ సిస్టం వలన, ఆ ట్రావల్ కంపెనీ మూలముగా టికెట్లు కొనుకున్న వారి డాటా మొత్తం మిగిలిన వారు కూడా చూడగలిగేలా జరిగింది.

No comments:

Post a Comment