Saturday, May 10, 2014

మదర్స్ డే కి 100 సంవత్సరాలు నిండింది.... అందరి తల్లులకూ "హ్యాపీ మదర్స్ డే".....వివరణ మరియూ ఫోటోలు

అందరి తల్లులకూ "హ్యాపీ మదర్స్ డే"


వెస్ట్ విర్జీనియాకు చెందిన మహిళా నిర్వాహకురాలు అన్నా జర్వీస్ 1850 లో మదర్స్ డే వర్క్ క్లబ్ అనే పేరుతో ఒక సంఘం ఏర్పరచి పరిశుద్ధత , శిశు మరణాలు తగ్గించడానికి రోగ నిరోధక మరియూ పాలు కలుషితానికి పోరాటాలు, పనులు చేసేరు. ఈమె ఏర్పాటు చేసిన మదర్స్ డే క్లబ్ లో సభ్యులుగా చేరినవారు, అమెరికా అంతర్ యుద్దములో గాయపడిన వారికి తల్లులుగా మారి సేవలు అందిచేరు. యుద్దములో భర్తలను కోల్పోయిన భార్యలను ఓదార్చి ఆదుకున్నారు. ఇది గ్రహించిన ఆనాటి ప్రముఖ సంగీత విద్వాంసుడు జూలియా వార్డ్ హోవే మదర్స్ డే ప్రకటనగా 1870 లో మహిళలు రాజకీయాలలోకి వచ్చి ప్రపంచ శాంతి రక్షణకు పాటుపడాలి అని పిలుపునిచ్చేరు.


అన్నా జర్వీస్ కు పిల్లలు లేరు. కానీ తన తల్లి చనిపోయిన రోజున ఆమె తన తల్లి తనకు అందించిన సేవలూ, స్నేహం మరియూ ప్రేమ ను గుర్తుకు తెచ్చుకుని 1908 లో మొట్టమొదటి సారిగా మదర్స్ డే ను ఒక చర్చ్ లో పాటించేరు. ఆ తరువాత ఆ చర్చ్ కు మదర్స్ డే స్రైన్ గా పేరుపెట్టేరు. అన్నా జర్వీస్ ఎడతెగని ప్రయత్నము వలన మదర్స్ డే చాలా నగరాలకు వ్యాపించింది. ఇది అర్ధం చేసుకున్న ఆ నాటి అమెరికన్ ప్రెశిడెంట్ వుడ్రో విల్సన్ 1914 మే నెల రెండవ ఆదివారమును మదర్స్ డే గా ప్రకటించి సెలవు దినముగా ప్రకటించేరు.(అప్పటికి ఇంకా ఆదివారం సెలవు దినముగా చేయబడలేదు). అలా అధికార పూర్వకంగా వెలుగుకు వచ్చిన మదర్స్ డే కు 100 సంవత్సరాలు అయ్యింది.


No comments:

Post a Comment