Wednesday, April 16, 2014

సన్నటి గాలి నుండి మంచి నీరు.....ఫోటోలు

కొన్ని సంవత్సరాల ముందు మన గ్రామాలూ/పట్టణాలు ఎలా ఉండేవి!! స్వర్గంలా ఉండేవి కాదూ… పచ్చగా కళ కళలాడే పంటలు, ఎక్కడ త్రవ్వితే అక్కడ పడే నీళ్ళు, ఊర్ల చుట్టు పక్కల పెద్ద పెద్ద చెరువులు,రెండు మూడు నెలలు వర్షాలు, అధ్భుతమైన చల్లటి వాతావరణం, కొన్ని చోట్లలో నీళ్ళు కొనుక్కుంటారంటా అని ఆశ్చర్యంగా చెప్పుకునే జనాలు.

ఇప్పుడో

వేలకు వేలు అప్పు తెచ్చి వందల అడుగులు త్రవ్వినా బయటపడని నీటి చుక్క, కిలోమీటర్లు నడిచి..జనాలతో పోట్లాడితే..అతి కష్టం మీద దొరికే బిందె నీళ్ళు, కంటి మీద కునుకు లేకుండా అర్థతాత్రి ఐనా,నీళ్ళ ట్యాంకర్ల కోసం ఎదురుచూసే కళ్ళు, కలుషితం ఐపోయిన ఉప్పు నీటినే వాడుతూ విధిలేక అనారోగ్యాన్ని ఆహ్వానించే అసహాయ జనాలు. ప్రుభుత్వాలు ఈ నీటి ఎద్దడి గురించి ఎందకని ఆలోచించవో......!?

ఇతియోపియాలో సన్నటి గాలి నుండి మంచి నీరు ఎలా తెచ్చుకుంటున్నారో చూడండి. అతి చిన్న టెక్నాలజీతో వెదురు బుట్టలతో గాలిలోనుండి మంచి నీరు తెచ్చుకుంటున్నారు. ఈ బుట్టల మూలంగా రోజుకు 100 లిటర్ల నీరు తెచ్చుకోవచ్చుట. మనదేశములో కూడా ఇలాంటివి ఏర్పరచవచ్చు కదా?!


No comments:

Post a Comment