Wednesday, April 30, 2014

"దయ" తో మీరు చేసే పనులకు మీకు లభించేదేమిటి....ఇదే....వీడియో


సంగీతానికి భాషతో పనిలేదు....అత్యంత ప్రసిద్దిచెందిన కప్(cup) పాట....వీడియో

ఈ పాట అత్యంత ప్రసిద్ది చెందింది. 1931 లో మొదటిసారిగా పాడిని ఈ ఐరిస్ పాటను అ తరువాత ఎంతోమంది సంగీత కళాకారులు పాడేరు. ఒక ఆంగ్ల సినిమాలో కూడా ఈ పాటను ఉపయోగించుకున్నారు. కానీ ఈ మధ్య ఐర్లాండ్లో ఒక సంగీత కళాకారిణి ఈ పాటను 600 మంది విధ్యార్ధులతో, 600 కప్పులు ఉపయోగించి పాడించింది. ఆ పాట అంతర్జాలములో అద్భుతం స్రుష్టించింది. మీరు కూడా వినండి. సంగీతానికి భాషతో పనిలేదు.

Tuesday, April 29, 2014

ఏ సి-5 గాలక్సీ విమానంలో ఎన్ని పడతాయో చూడండి.....ఫోటోలు


ఈ అతిపెద్ద కంపెనీలన్నీ మొదట చిన్న షెడ్డు లో మొదలెట్టేరంటే నమ్మగలరా.....ఫోటోలు

గూగుల్(Google): సెప్టంబర్ 17,1997 లో మొదలుపెట్టబడిన ఈ కంపెనీ మొదటిపేరు బ్యాక్ రబ్. ఆ తరువాత కంపెనీ పేరుని "గూగొల్" అని పెట్టాలనుకుని స్పెల్లింగ్ మిస్టేక్ వలన "గూగ్లె"(గూగుల్) గా పెట్టబడింది.అసలు గూగొల్ అంటే 1 తరువాత 100 సున్నాలు. దీనికి అర్ధం అత్యంత అధిక సమాచారం అందిస్తాము అనట.

ది వాల్ట్ డిస్నీ కంపెనీ(The Walt Disney Company)......అక్టోబర్ 6, 1923 న డిస్నీ బ్రదర్స్ ఒక కార్టూన్ స్టూడియోగా మొదలుపెట్టేరు. ఆ తరువాత సినిమా ప్రొడక్షన్, టెలివిషన్, తీం పార్క్ గా ఎదిగి ఇప్పుడు ఇప్పుడు అమెరికాలోనే అతిపెద్ద అనిమేషన్ సంస్థగా పేరుపొందింది.

అమజాన్(Amazon):....భవిష్యత్తులో అంతర్జాలం అత్యంత ఎత్తుకు ఎదిగి, విపరీతమైన ఆర్ధీక పురోగత్ పొందుతుందనే ఒక రిపోర్ట్ చదివి,బిజోష్ అనే అతను అంతర్జాల అంగడి మూలముగా కాంపక్ట్ డిస్కులూ, కంప్యూటర్ హర్డ్ వేర్, కంప్యూటర్ సాఫ్ట్ వేర్, వీడియోలూ మరియూ పుస్తకాలు అమ్మదలుచుకుని ఈ సంస్థ మొదలుపెట్టేడు. వాషింగ్టన్ లో 1994 న మొదలుపెట్టబడింది

మట్టెల్(Mattel):....1945 లో హెరాల్డ్ మట్ అనే అతను తన భార్యతో కలిసి ఒక చిన్న ఫోటో ఫ్రేం ల బిజినస్ పెటుకున్నాడు. అ తరువాత కుర్చీలు అల్లడం నేర్చుకుని కూర్చీల వ్యాపారం మొదలు పెట్టేరు. ఆ తరువాత బార్బీ బొమ్మలు తయార్య్చేసేరు. ఈ బిజినస్ వారికి మంచి పేరు తెచ్చింది. 1959 లో పూర్తిగా బార్బీ డాల్ పేరుతో బొమ్మలు తయారుచేయడంతో వారిది అతిపెద్ద పరిశ్రమ గా ఎదిగింది. ఈ రోజు టాయ్ పరిశ్రమలలోనే ఒక వింప్లవం స్రుష్టించి బార్బీ డాల్ అంటే మెటేల్ అనే పేరే గుర్తొస్తుంది.

ఆపిల్(Apple):......1971 లో స్టీవ్ జాబ్స్ తన మిత్రుని సహాయముతో దూర ప్రాంతాలకు ఉచితముగా ఫోన్లు చేసుకోవడానికి ఫోన్లు తయారుచేయడం మొదలు పెట్టేరు. ఆ తరువాత అతని మిత్రుని సహాయముతో కంప్యూటర్లు అసెంబుల్ చేసే అమ్మడం మొదలుపెట్టి ఇప్పుడు దాన్నిని ప్రపంచములొనే అతి ముఖ్యమైన కంపెనీగా అభివ్రుద్ది చేసేడు.

మైక్రోసాఫ్ట్(Microsoft):.....బిల్ గేట్స్ తన మిత్రుడు పౌల్ అల్లెన్ తో కలిసి "ఆల్టైర్" కంప్యూటర్లకు ప్రోగ్రాం రాసేరు. ఈ ప్రోగ్రాం పర్సనల్ కంప్యూటర్లలో ఎమెస్-డాక్ గా 1980 లో పేరుపొంది మైక్రోసాఫ్ట్ విండోస్ గా మారింది. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టం లేని కంప్యూటరే లేదని చెప్పవచ్చు. తన కంపెనీ మూలముగా బిల్ గేట్స్ ఇంతవరకు 3 గ్గురిని బిల్లియనర్లు గానూ, 12,500 మందిని మిల్లియనర్లుగానూ చేసేరు

హెచ్ పి(HP):....1938 లో హ్యూలెట్ మరియూ పాకర్డ్ అనే ఇరువురు ఒక చిన్న గ్యారేజీలో 500 డాలర్లతో ఆడియో ఒసియేట్ర్లను తయారుచేసేరు. 1939 లో వాల్ట్ డిస్నీ స్టూడియో వారు వీరందించిన ఆడియో ఒసియేటర్లను తమ సౌండ్ సిస్టంలో వాడి ఆశ్చర్యపోయేరు. ఎందుకంటే అది స్టీరియోఫోనిక్ సౌండ్ అందించింది. దానినే మొదటి ఫాంటేసియా లో ఉపయోగించేరు.

Monday, April 28, 2014

ప్రతి సెకెండ్ కీ టెక్నాలజీ కంపెనీలు ఎంతత్వరగా తమ ఆదాయాన్ని సంపాదించుకుంటున్నాయో చూడండి...ఇన్ ఫో గ్రాఫ్Click image to open interactive version

ఇమేజ్ మీద క్లిక్ చేయండి.....మళ్ళీ ఇమేజ్ లో ఉన్న ప్లే బటన్ మీద క్లిక్ చేయండి...మీకే తెలుస్తుంది. Click on the image and again click on the play button.

"అంతరిక్ష ఎలివేటర్" పై పరిశోధనలు జరుపుతున్నామని తెలిపిన "గూల్ ఎక్స్" సంస్థ....ఫోటోలు, వివరణ మరియూ వీడియో

గూగుల్ సంస్థ ఎంత పెద్దదో మీకెవరికీ నేను తెలియపరచనవసరం లేదు. ఎందుకంటే అంతర్జాల ప్రపంచములో గూగుల్ ఏ మెట్టు మీద ఉన్నదో, ఆ కంపెనీ పలుకుబడి ఏమిటో అందరికీ తెలుసు. అంతర్జాలంలో సంచలనం స్రుష్టిస్తున్న ఈ కంపెనీ మరికొన్నీ రంగాలలో కూడా అడుగు పెట్టిందని కూడా కొందరికి తెలుసు.

గూగుల్ డ్రైవెర్ లెస్ కారు, గూగుల్ కంప్యూటర్ కళ్లద్దాలు, బలూన్ల తో ప్రపంచవ్యాప్తంగా వై.ఫై(WiFi)ఇంటర్నెట్ మరియూ సౌరసక్తితో కరెంటు అందించడం వంటివి మరికొన్ని ఈ సంస్థ అందించిన/అందించబోతున్న కార్యకలాపాలు. కాని అదే గూగుల్ సంస్థ మరో విపరీత ప్రయత్నం చేస్తోందని ఎంతమందికి తెలుసో నాకు తెలియదు...అదే స్పేస్ ఎలివేటర్( భూమి నుండి అంతరిక్షానికి ఎలివేటర్).

గూగుల్ సంస్థ యొక్క రహస్య పరిశోధనా కేంద్రమైన "గూగుల్ ఎక్స్" ఎన్నో పరిశోధనలు చేస్తోంది. అందులో ఒకటే ఈ స్పేస్ ఎలివేటర్. ఇప్పటి వరకు అంతరిక్ష నౌకల మూలంగానే అంతరిక్షానికి వెళ్ళగలుగుతున్నారు. అయితే గూగుల్ ఎక్స్ పరిశోధన చేస్తున్న స్పేస్ ఎలివటర్ విజయవంతమైతే అంతరిక్షానికి నిచ్చన వేసినట్లే.దీని గురించిన పూర్తి వివరాలను మీరు ఈ వెబ్ అడ్రెస్: http://www.fastcompany.com/3028156/united-states-of-innovation/the-google-x-factor లో చూడవచ్చు.

ఏది ఏమైన గూగుల్ సంస్థ అంతర్జాలానికే పరిమితం కాదని, ఎన్నో విప్లవాత్మక మానవ పరిశోధనలకు గట్టిఉ పునాదులు వేసే సంస్థగా ఎదుగుతోందని తెలుసుకోవడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. హాట్స్ ఆఫ్ టు గూగుల్.


గూగుల్ ఎక్స్ కంపెనీ పరిశోధనా కేంద్ర అధిపతి ఆస్ట్రో టెల్లర్.


Sunday, April 27, 2014

దాగున్న అతి చిన్న ప్రపంచాన్ని తన ఫోటోలమూలం చూపించిన మికీ అసాయ్....ఫోటోలు

జపాన్ దేశానికి చెందిన మాక్రో ఫోటోగ్రాఫర్ మికీ అసాయ్ తీసిన అద్భుతమైన ఫోటోలు.