Friday, March 14, 2014

యూక్రైన్లో రష్యా దళాలు.....ఫోటోలు

యూక్రైన్ దేశములోని క్రిమియా ప్రాంతాన్ని ఒక నెత్తురు చుక్క కూడా వ్రుధా కాకుండా రష్యా ఆక్రమించుకుంది. యూక్రైన్లో ఉన్న ఈ ప్రాంత ప్రజలు రష్యా తో కలవాలని ఇష్టపడుతున్నారు. అందువలన వారి ప్రాంతములోకి చొచ్చుకు వచ్చిన రష్య దళాలను అక్కడి ప్రజలు స్వాగతం పలికేరు.

క్రిమియా పార్లమెంటు ఉక్రెయిన్‌ నుంచి విడిపోయి రష్యాలో కలవాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన ఉక్రెయిన్‌ను మరింతగా సంక్షోభంలోకి నెట్టనుంది. అంతేకాకుండా రష్యాకీ, పశ్చిమ దేశాలకూ మద్య ఉద్రిక్త వాతావరణం ఇంకా పెరగనుంది. రష్యా ఫెడరేషన్‌లో క్రిమియాను చేర్చుకునే ప్రక్రియను ప్రారంభించ వలసినదిగా రష్యా అధ్యక్షుడు వ్లాడీమీర్‌ పుతిన్‌, రష్యా పార్లమెంటులకు క్రిమియా పార్లమెంటు విజ్ఞప్తి చేసింది. ఈ విషయం గురించి క్రిమియన్‌ పార్లమెంటు వెబ్‌ సైట్‌లో ప్రకటించారు. గత నెలలో ఉక్రెయిన్‌లో జరిగిన రాజ్యాంగ వ్యతిరేక తిరుగుబాటు వలన అధ్యక్షుడు విక ్టర్‌ యానుకోవిచ్‌ పదవినుండి వైదొలగ వలసి వచ్చింది. ఈ సంఘటనతో రష్యన్లు ఎక్కువగా ఉన్న క్రిమియాలో మానవ హక్కులకూ, భావ ప్రకటనా స్వేచ్చకూ ప్రమాదం ఏర్పడిందని తమ నిర్ణయం వెనుకనున్న కారణాలను వివరిస్తూ క్రిమియా పార్లమెంటు సభ్యులు తెలిపారు.


1 comment:

  1. >>యూక్రైన్ దేశములోని క్రిమియా ప్రాంతాన్ని ఒక నెత్తురు చుక్క కూడా వ్రుధా కాకుండా రష్యా ఆక్రమించుకుంది. యూక్రైన్లో ఉన్న ఈ ప్రాంత ప్రజలు రష్యా తో కలవాలని ఇష్టపడుతున్నారు. అందువలన వారి ప్రాంతములోకి చొచ్చుకు వచ్చిన రష్య దళాలను అక్కడి ప్రజలు స్వాగతం పలికేరు.

    స్ప్లెండర్ అఫ్ యోగ గారు, రష్యా క్రిమియాను ఆక్రమించుకుంది అనేది పూర్తిగా నిజం కాదు, వెస్ట్రన్ మీడియా ప్రచారం వలన మనకు అలా అనిపిస్తుంది.

    చరిత్ర ఏమిటంటే, క్రిమియ ఒకప్పుడు రష్యా లో భాగము, కొన్ని పరిస్తితులలో క్రిమియాను ఉక్రెయిన్ కు బహుమతిగా ఇస్తూ రష్యా నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయం లేదా ఒప్పందంలో భాగంగా రష్యా సైన్యం క్రిమియాలో ఉండొచ్చు, ఆ ఒప్పందం ప్రాకారమే సుమారు 25౦౦౦ మంది రష్యా పదాతి దళం, మరియు మరి కొన్ని ఇతర దళాలు ఎల్లప్పుడూ క్రిమియాలో ఉండొచ్చు, ఆ ప్రకారంగా రష్యా దళం క్రిమియాలో ఉంది. దానిని ఆక్రమణగా చిత్రీకరించారు, మీకు ఈ సమాచారం సబబుగా అనిపిస్తే ఈ పోస్టును సరిదిద్దుకోగలరు.

    http://rt.com/news/russian-troops-crimea-ukraine-816/

    మరియు కింది లింకులో 2014 Crimean crisis అను విభాగము చూడుము
    http://en.wikipedia.org/wiki/History_of_Crimea

    ReplyDelete