Wednesday, February 12, 2014

మాంత్రీక భావి.....ఫోటోలు మరియూ వీడియో

ఎస్టోనియా, అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా. ఉత్తర యూరప్ బాల్టిక్ ప్రాంతంలోని ఒక దేశం. దీని ఉత్తరాన ఫిన్లాండు, పశ్చిమాన స్వీడెన్, దక్షిణాన లాట్వియా మరియు తూర్పున రష్యా దేశాలు ఎల్లలుగా గలవు.

ఎస్టోనియా దేశములో తుహలా అనే గ్రామములో ఉన్నది ఈ మాంత్రీక భావి. ఎస్టోనియా దేశములోనే ఈ గ్రామములో అత్యధికమైన భూగర్బ బావులు మరియూ నదులు ఉన్నాయి. గత 3000 సంవత్సరాల నుండి తుహలాలో ఉన్న ఈ మాంత్రీక భావి అత్యద్భుత ప్రక్రుతి వేడుకను చూపుతోంది. 2.5 మీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ భావి నుండి వర్షాకాలములో నీరు పొంగి నదిలాగా ఏర్పడి అక్కడున్న మొత్త ప్రాంతమునూ వరదతో ముంచుతుంది. ఈ గ్రామములో నివసించే ప్రజలు దీనిని మాంత్రీక భావి అని పేరుపెట్టేరు. వారి కధల ప్రకారం ఇద్దరు మంత్రగాళ్ళు భూమి క్రింద యుద్దం చేసుకోవటంవలనే ఇలా భావి నుండి నీరు వచ్చి వరదగా ప్రవహిస్తోంది. అప్పుడప్పుడు మేము ఈ భావి మీద రెండు మండుతున్న రూపాలను చేసేమని చెబుతారు. ఏదైనా ఇది ఒక మాంత్రీక ప్రదేశం. ఇక్కడ ఉండటానికి మాకు చాలా ఇష్టం అని చెబుతారు.



No comments:

Post a Comment