Tuesday, January 7, 2014

చైనాలో దొరికే/అమ్మే అసాధారణమైన కొన్ని......ఫోటోలు

బరువు తగ్గించే సగం చెప్పులు.....వేసుకుంటే పాదాలకు సగం వరకే వచ్చే ఈ చెప్పుల వలన నడిచే నడకలొ ధోరని మారుతుందట. దీనివలన ఎక్కువ కెలోరీలు కరుగుతాయట. అలా బరువు తగ్గించుకోవచ్చునట.

బతికున్న పీతల వెండింగ్ మిషన్.

వివాహమవని మొగ పిల్లల కోడిగుడ్లు.....10 సంవత్సరాల వయసు కు తక్కువ వయసున్న మొగ పిల్లల మూత్రముతో ఉడకబెట్టిన/ ఉంచిన కోడిగుడ్లు. ఇది చైనాలో అత్యంత సాంప్రదాయక ఆహారం. ఈ గుడ్డు తింటే ఆరొగ్యం చాలా బాగుంటుందట.

పాండా టీ....పాండా విసర్జనలతో పండించిన టీ. అత్యంత ఖరీదైన టీ. ఒక కిలో టీ పొడి ఖరీదు రూ.50 లక్షలు.

సమాన ముఖ ముసుగు.....అందంగా కనబడటానికి ముఖానికి అతికించుకునే ముసుగు. ముసుగు కొనుక్కునే వారికి ముసుగుతోపాటూ ఆ ముసుగును ముఖానికి అతికించుకోవటానికి ప్రత్యేక బంక ఇస్తారు.

బ్రతికున్న జంతు జీవుల కీ చైన్లు.

కన్య పిల్లలు పెదాలతో తీసిన టీ ఆకులు.....కన్యలు పెదలతో తీసిన టీ ఆకులు/ టీ పొడి.

స్వచ్చమైన గాలి కలిగిన డబ్బాలు.....విపరీత కలుషిత/హానికరమైన గాలి నిండిన నగరాలలో స్వచ్చమైన గాలి పీల్చుకోవాలనుకునే వారి కొసం.

అద్దె స్నేహితులు......మనుష్యులను కొనుక్కోలేరు. కానీ వారిని స్నేహితులుగా అద్దెకు తీసుకోవచ్చు.

No comments:

Post a Comment