Monday, January 20, 2014

ప్రపంచములోనే అతిపెద్ద స్కూల్.....ఫోటోలు

ప్రపంచములోనే అతిపెద్ద స్కూల్ మన భారతదేశములోనే ఉన్నదని తెలుసుకుని, గర్వపడి, ఈ విషయం మీ అందరితో పంచుకుందామని ఈ టపా రాస్తున్నాను.....ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరములో ఉన్న ఈ స్కూల్ పేరు సిటీ మాంటిసరీ స్కూల్. 1959 లో 5 గురు విధ్యార్ధులతో డా.జగదీష్ గాంధి అనే ఆయన "చదువుకోవటం పిల్లలకు హక్కు" అనే నినాదంతో మొదలుపెట్తిన ఈ స్కూల్లో ఇప్పుడు 47,000 మంది విధ్యార్ధినీ,విధ్యార్ధులు చదువుకుంటున్నారు. ఇదే ప్రపంచములోనే అతిపెద్ద స్కూల్ అనే పేరు సంపాదించుకుని యునెస్కో వారి గుర్తింపు పొందింది....ఈ స్కూల్లో 1000 క్లాస్ రూములూ, టీచర్లతో సహా 3,800 మంది పనిచేస్తున్నారు. ఈ స్కూల్లో మామూలు పాఠాలతో పాటూ "ప్రపంచ శాంతి" గురించి ఒక క్లాస్ జరుపుతారు.


No comments:

Post a Comment