Tuesday, January 7, 2014

చలికి గజ గజ వణికిపోతున్న అమెరికా నగరాలు/ -30 డిగ్రీలకు పడిపోతున్న వాతావరణం.....ఫోటోలు మరియూ వీడియో

అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని భారీ మంచు తుపాన్‌ అతలాకుతలం చేస్తోంది. మసాచుసెట్స్‌లో 53 సెంటీ మీటర్లు (21 అంగుళాల) ఎత్తున మంచు పేరుకుపోయిందంటే తుపాన్‌ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. కొత్త ఏడాది (2014) లో ఇదే అతి పెద్ద మంచు తుపాన్‌. మధ్య పశ్చిమ రాష్ట్రాల నుండి తూర్పు వైపుగా భారీ మంచు తుపాన్‌ ప్రభావం పెరుగుతుండడంతో వేలాది విమానాలను రద్దు చేశారు. పరిస్థితులు చాలా ఆందోళన కరంగా ఉన్నాయి. న్యూయార్క్‌, న్యూజెర్సీ నగరాల్లో గవర్నర్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలను ఇళ్ళల్లో నుండి బయటకు రావద్దని సూచించారు. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయానికి పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందనే హెచ్చరిక నేపథ్యంలో వాణిజ్య సముదాయాలు, పాఠశాలలను మూసేశారు. పెద్దస్థాయిలో మంచు, గాలులను చూస్తున్నామని అమెరికా జాతీయ వాతావరణ విభాగం అధికారి జాసన్‌ తుయెల్‌ చెప్పారు. భారీగా మంచు పేరుకుపోతుండడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పారు. 2,200 విమానాలు గురువారం రద్దు అయ్యాయి. శుక్రవారం సాయంత్రం బయలుదేరాల్సిన విమానాలను ఇప్పటికే రద్దు చేశారు. న్యూయార్క్‌, బోస్టన్‌ నగరాల్లోని వీధుల్లో నిరాశ్రయులుగా ఉన్న వారి కోసం కొన్ని బృందాలు పనిచేస్తున్నాయి. బోస్టన్‌ ఉత్తర ప్రాంతంలోని బాక్స్‌ఫోర్డ్‌లో, న్యూయార్క్‌, మసాచుసెట్స్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా 53 సెంటీమీటర్ల హిమపాతం నమోదైనట్లు సమాచారం. ఇతరత్రా చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మంచు తుపాన్‌ కారణంగా చాలామంది ప్రజలు విద్యుత్‌ లేక అంధకారంలో ఉన్నారు.


No comments:

Post a Comment