Wednesday, December 18, 2013

బ్రకెన్ గబ్బిలాల గుహ: ప్రపంచములోనే అతిపెద్ద గబ్బిలాల కాలనీ.....ఫోటోలు

అమెరికాలోని టెక్సాస్ నగరానికి వెలుపల ఉన్న సథెరెన్ కోమల్ కౌంటీ అనే చోట ఈ బ్రకెన్ గబ్బిలాల గుహ ఉన్నది. ప్రతి సంవత్సరం వేసవి కాలములో మెక్సికో దేశము నుండి సుమారు 20 మిల్లియన్ల గబ్బిలాలు ఇక్కడకు వలస వస్తాయి. మార్చ్ నెల నుండి అక్టోబర్ నెలవరకు ఆ గుహలో జీవిస్తూ, తమ జాతిని పెంచుకుంటాయి. అదే సమయములో ప్రతిరోజూ రాత్రి పూట ఆ గబ్బిలాలన్నీ 100 అడుగుల వైశాల్యమున్న గుహ ముఖద్వారము నుండి పైకి వచ్చి ఆకాశములోకి 10,000 అడుగుల ఎత్తువరకు వెడతాయి. అన్ని గబ్బిలాలు కలిసికట్టుగా ఎగురుతున్నప్పుడు 60 మైళ్ల దూరంవరకు కారుమబ్బు కమ్ముకున్నట్లు ఉంటుందట. అవి చేసే శబ్ధాలు ఉరుముల వలె వినబడతాయట. అవి అలా ఆకాశంలోకి ఎగిరి వెడుతూ, గాలిలో ఎగురుతున్న పురుగులను తింటూ మళ్ళీ తెల్లవారుజామున గూడు చేరుకుంటాయట.


No comments:

Post a Comment