Sunday, December 8, 2013

ఈ దేశాలు వేటిలో మొదటి స్థానం వహిస్తున్నాయో తెలుసుకోండి....ఫోటోలు

ఆఫ్గనిస్తాన్: ప్రపంచానికే మత్తు పధార్ధాల రాజధాని.

సింగపూర్: పసి పిల్లలను కాపాడుకోవటానికి చేసే ప్రయత్నాలలో మొదటి స్థానం. ఎందుకంటే ఇక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువ. దీనికి కారణం ఇక్కడి ప్రజలు దాంపత్య బంధుత్వానికి ఇచ్చే ప్రాముఖ్యత చాలా తక్కువ. అందుకని పిల్లలు పుట్టడం కూడా చాలా తక్కువ. అందుకని, పుట్టిన పిల్లలను బ్రతించుకోవటానికి ఎక్కువ భాద్యత తీసుకుంటుంది ఇక్కడి ప్రభుత్వం.

ఆస్ట్రేలియా: యూరేనియం తయారీలో మొదటి స్థానం. యురేనియం ఎంత హానికరమైనదో మీకందరికీ తెలుసు. ఈ దేశంలోని సాలీడులు, తేళ్ళూ, పాములూ అత్యంత విషపూరితమైనవి. ఒక విధముగా నరకమనే చెప్పాలి. ఈ దేశములోని మట్టి కూడా హానికరమని చెబుతారు.

వెనుజులా: అందమైన మహిళలకు మొదటి స్థానం: ప్రపంచ అందాల పోటీలలో 19 సార్లు బహుమతులు తెచ్చుకున్నారు. అమెరికా కంటే 5 సార్లు ఎక్కువ, భారతదేశం కంటే 11 సార్లు ఎక్కువ.

యూనైటడ్ అరబ్ ఎమిరేట్స్: తక్కువ మరణ సంఖ్య. అమెరికా, కతార్,నేపాల్, లావోస్, పాకిస్తాన్, అరుబ్ మరియూ ఇరాన్ దేశలు ప్రపంచ మరణాల సంఖ్యలో తక్కువ శాతం వహిస్తున్నా, ఈ దేశం అతి తక్కువ సంఖ్యలో ఉందంటే చాలామంది ఆశ్చర్య పోతున్నారు. ఈ దేశములో సరాసరి 1000 మందికి, ఒక మరణమే జరుగుతోందట.

స్విజర్లాండ్: లంచం ఇవ్వని ప్రజలు: ప్రపంచదేశాలలో వ్యాపరవేత్తలూ, రాజకీయ నాయకులు అవినీతితో సంపాదించుకున్న డబ్బును స్విస్ బ్యాంకులలో దాచుకుంటారు. కానీ స్విజర్లాండ్ ప్రజలూ, వ్యాపారవేత్తలూ, రాజకీయ నాయకులూ లంచం ఇవ్వరట.

అర్మేనియా: టెక్నాలజీ పరంగా ఈ దేశం ఎంత అభివ్రుద్ది చెందిదో తెలియదు గానీ, ప్రపంచవ్యాప్తంగా దొరుకుతున్న పైరసీ సాఫ్ట్ వేర్లలో 92 శాతం ఈ దేశములో తయారుచేయబడినవేనట.

రష్యా: బిల్లియనర్లూ మరియూ డైమండ్లు ఎక్కువున్న దేశం.....ఒక్క మాస్కోలోనే 64 మంది బిల్లియనర్లు ఉన్నారట. ప్రపంచములోనే అత్యధిక ధనవంతుల పట్టీలో రష్యా ప్రెశిడెంట్ వాల్డిమీర్ పుటిన్ ఒకరనేది మీకు తెలిసే ఉంటుంది. ఇక పోతే డైమండ్ల విషయానికోస్తే రష్యా నేల మీద పొపిగై తోకచుక్క పడటమే కారణం. ఈ తోకచుక్కలో ఎనలేని డైమండ్లు ఉన్నాయట. అయితే తోక చుక్క పడిన చోట తవ్వకానికి ప్రక్రుతి తావివ్వటంలేదట. కానీ రష్యా డైమండ్ల మీద కూర్చున్నదన్నిది నిజమే, ఈ రోజు కాకపోతే, మరికొన్ని రోజుల్లో వాటిని తవ్వి తీస్తారు.

ఇటాలీ: అన్ని రకాల ఆటలనూ ఆడటమే కాకుండా ఆ ఆటల పోటీలు కూడా నిర్వహిస్తారు.

ఇజ్రేల్: సోషియల్ మీడియాను అధికంగా వాడుతున్న దేశం.

No comments:

Post a Comment