Saturday, December 7, 2013

ప్రపంచాన్ని మేలైనదిగా చేసిన వీరి గురించి తెలుసుకోండి.....ఫోటోలు

స్వీడన్ కు చెందిన Nils Bohlin అనే ఈ ఇంజనీర్ 1959 లో కారు ప్రయాణాలలో సీటి బెల్టును కనుగొన్నారు. దీని వలన ఎంతోమంది జీవితాలు కాపాడబడ్డాయి.

Maurice Ralph Hilleman అనే ఈ అమెరికన్ శాస్త్రవేత్త టీకా (vaccine) చదువులో అరితేరిన శాస్త్రవేత్త. 20 వ శతాబ్ధములో ఎక్కువమంది ప్రజలను కాపాడిన ఘనత ఈయనకే దక్కుతుంది. ఈయన తారుచేసిన టీకాలు measles, mumps, hepatitis A, hepatitis B, chickenpox, meningitis, pneumonia and Haemophilus influenzae bacteria మానవజాతికి ఎంత ఉపయోగపడుతున్నయో మనందరికీ తెలుసు. 1957 లో ఏసియన్ ఫ్లూ ప్రపంచాన్ని బయపెట్టిస్తుంటే, ఆ వ్యాధికి టీక కనిపెట్టి మానవ జాతికి ప్రశాంతతను అందజేసేడు.

Vasili Arkhipov and Stanislav Petrov అనే వీరిరువురూ ఆర్మీ కమాండర్లుగా పనిచేసి, వారి హయాములో తప్పుడు సమాచారములతో వచ్చిన సెటిలైట్ సంకేతాలకు భయపడకుండా, నిగ్రహంతో పనిచేసి 2 న్యూక్లియర్ యుద్దాలను తప్పించేరు.

Charles Francis Feeney అనే ఈ ఐరిస్-అమెరికన్ వ్యాపరవేత్త తాను సంపాదించిన మొత్త 7.5 బిల్లియన్ డాలర్ల ఆస్తిని The Atlantic Philanthropies అనే ట్రస్ట్ పేరుతో దానధర్మాలకు వినియోగించేరు.

Norman Ernest Borlaug: అమెరికాకు చెందిన ఈ బయాలజిస్ట్ వ్యవసాయ రంగములో కీలక మార్పులు తీసుకు వచ్చి సుమారు 20 బిల్లియన్ ప్రజలను కాపాడేరు. వ్యాధి నిరోధక గోధుమ తయారీలో ఈయన చేసిన క్రుషి ఈయనకు అనేక బహుమతులను అందచేసింది. అందులో మన భారతదేశ పద్మ భూషన్ బహుమతి కూడా ఉన్నది.

Henrietta Lacks అనే ఈమె వైద్య పరిశోధనలకు తన కాన్సర్ కణాలను అందించింది. ఈ కణాలతోనే మొట్టమొదటి పాడైపోని కణాలను తయారుచేయగలిగేరు. అందుకని ఆ పరిశోధనకు అమే పేరులోని కొన్ని అక్షరాలను పెట్టి HeLa cell line అనే పేరుపెట్టేరు. 1954 లో ఈమె అందించిన కణాలతోనే పోలియో టీకా తయారుచేయబడింది. 1955 లో మొదటి మానవ కణాల క్లోనింగ్ కూడా ఈమె అందించిన కణాలతోనే జరిగింది. ఈమె కణాలను ఉపయోగించుకుని ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాల వ్యాధులకు మందుల పరిశోధనలో విజయవంతమయ్యేరు.

James Harrison: బంగారు చేతులు కలిగిన మనిషి అని పిలువబడే ఈయనకు నెత్తురులోని ప్లాస్మా లో వ్యాధి నిరోధక శక్తులు ఉన్నట్లు తెలిసింది. అది తెలుసుకున్న ఈయన తన నెత్తురులోని ప్లాస్మాను 1000 సార్లు దానం చేసేరు. దీనివలన సుమారు పుట్టబోయే 2 మిల్లియన్ పిల్లలకు ఈయన ప్లాస్మా ఊపిరిపోసిందట.

Willis Haviland Carrier: 1902 లో ఏర్ కండిషన్ కనుగొన్నారు.

No comments:

Post a Comment