Friday, December 27, 2013

టోరంటో నగరంలో మంచు తుఫాన వచ్చిన తరువాత.....ఫోటోలు

4 రోజుల క్రితం కెనడాలోని తూర్పు ప్రాంతాన్ని మంచు తుపాను ముంచెత్తింది. తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లక్షలకు పైగా జనాభా క్రిస్మస్ రోజున అంధకారంలోనే గడిపారు. తుపాను ప్రభావాన మరింతగా మంచు కురిసే అవకాశాలు ఉన్నాయని అమెరికా జాతీయ వాతావరణ విభాగం వెల్లడించింది. విద్యుత్ సరఫరా లేనందున జనరేటర్లు వినియోగించి, వాటి నుంచి వెలువడిన విషవాయువు కారణంగా కెనడాలో ఐదుగురు మరణించారు.

మంచు తుపాను కారణంగా కెనడా తూర్పు ప్రాంతంలో జరిగిన వాహన ప్రమాదాల్లో మరో ఐదుగురు మరణించారు. మంచు తుపాను తాకిడికి గురైన ప్రాంతాల్లో కనీస ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. టొరంటోలో మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ సిబ్బంది నిరంతరాయంగా కృషి చేస్తున్నారని అధికారులు తెలిపారు. స్థానిక సహాయక బృందాలు వారికి సహకరిస్తున్నట్లు తెలిపారు.

తుపాన కారణంగా విమానాల రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది.


No comments:

Post a Comment