Monday, December 30, 2013

విచిత్రమైన ఆంగ్ల నూతన సంవత్సర సాంప్రదాయాలు.....ఫోటోలు

జనవరి-1 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమైనా, ప్రపంచములోని ప్రజలందరూ మానసికంగా ఆ రోజుని నూతన సంవత్సర మొదటి రోజుగా భావిస్తూ వేడుకలలో పాల్గొంటారు. మనదేశములో కూడా చాలామంది అలాగే భావించి డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలవరకు మేలుకుని, 12 దాటగానే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. జనవరి-1 న చాలామంది ఆలయాలకు వెళ్లి నూతన సంవత్సరమలో ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా జీవితం హాయిగా జరిగిపోవాలని ప్రార్ధణలు చేస్తారు.....ఇక జనవరి-1 ని సాంప్రదాయకంగా నూతన సంవత్సరంగా చేసుకునేవారి సంగతి చెప్పక్కర్లేదు. ఎన్నో విధాలుగా సంబరాలు చేసుకుంటారు. కానీ అలా జనవరి-1 నే నూతన సంవత్సరముగా వేడుకలు చేసుకునే వారిలో కూడా వేడుకలు చేసుకునే విధములో విచిత్రమైన సాంప్రదాయలు ఉన్నాయి. అవే మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము.

స్పైన్ దేశం: స్పైన్ దేశములో డిసెంబర్-31 అర్ధరాత్రి 12 దాటగానే అక్కడి ప్రజలు 12 ద్రాక్ష పళ్లు తింటారట. రాబోవు 12 నెలలూ సంతోషం మాత్రమే తీసుకు రావలని వారి కోరిక.

జర్మనీ: సరిగ్గా డిసంబర్-31 అర్ధరాత్రి 12 గంటలైన తరువాత అక్కడి ప్రజలందరూ "డిన్నర్ ఫర్ ఒన్" అనే టీవీ ప్రొగ్రాం తప్పక చూస్తారట. దేశంలో ఎక్కడున్నా అక్కడున్న టీవీ స్క్రీన్లలో ఈ ప్రొగ్రాం వేస్తారట.

నెదర్లాండ్: రెండవ ప్రపంచ యుద్దం తరువాత నెదర్లాండ్లో లక్షల కొలది పేలుడు పధార్ధాలు మిగిలిపోయినైయట. దాని గుర్తుగా పాల డబ్బాలలో కార్బైడ్ మరియూ నీరు కలిపి ఒక చోట ఉంచి, డిసెంబర్-31 అర్ధరాత్రి 12 తరువాత, ఆ డబ్బాలను వేడిచేసి గాలిలోకి(ఆకాశంలోకి) ఎగరవేస్తారట.

ఫిలిపైన్స్: గుండ్రని పధార్ధాలు అర్ధీక బలం తెచ్చిపెడతాయని, గుండ్రంగా ఉండే పండ్లను(12)తింటారు.

తాయ్లాండ్: నీటితో దేముని విగ్రహాలనూ, తల్లితండ్రులనూ, పెద్దలనూ శుభ్రపరిస్తే ఆ సంవత్సరమంతా ఆయురారోగ్యాలతో ఉంటారనే నమ్మకంతో ఒకరి మీద ఒకరు నీరు జిమ్ముకునే సంబరం చేసుకుంటారట.

స్కాట్లాండ్: ఈ దేశములో డిసెంబర్-31 అర్ధరాత్రి 12 దాటగానే కాగడాలతో తలమీద మరియూ శరీరంచుట్టూ నిప్పును తిప్పుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.

ఈక్వడార్: ద్రిస్టి బొమ్మలను తగలబెడతారు.

చిలి: ఇక్కడి ప్రజలు శ్మశానాలలో చనిపోయిన తమ సన్నిహితులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారట.

సౌత్ ఆఫ్రికా: ఇక్కడి ప్రజలు పాత వస్తువులను ఇళ్లల్లో నుండి బయట పారేస్తారట. అంటే ఇంటిని శుబ్రం చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.

No comments:

Post a Comment