Sunday, December 29, 2013

బెంగలూరు -నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి రైల్వేశాఖ నిర్లక్ష్యమే కారణమా?

అని ప్రశ్నించుకుంటే "అవును" అనే సమాధానమే దొరుకుతోంది.

భారత రైల్వే శాఖలోని రైల్ సేఫ్టీ విభాగంలో 1,42,311 పోస్టులు ఖాళీగానే ఉన్నాయట. అందువలన ఈ విభాగంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై ఎక్కువ పని ఒత్తిడి పడుతోంది. వీరంతా రోజుకు 14 గంటలు పనిచేస్తున్నారట.


ఈ మధ్య వార్తలలో "రైలులో ఘోర అగ్నిప్రమాదం" అన్న న్యూస్ హెడ్ లైన్లలో ఇది 3 వది. పోయిన సంవత్సరం జూలై 30 న నెల్లూరు దగ్గర తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు లో ఏర్పడ్డ అగ్నిప్రమాదంలో 47 మంది సజీవ దహనానికి మరణించేరు. ఈ రైలు అగ్నిప్రమాదం జరిగిన 3 నెలల తరువాత హైదరబాద్-సోలాపూర్ ప్యాసింజర్ రైలు అగ్నిప్రమాదంలో ఇరువురు మరణించేరు. 2011, నవంబర్-22 న హౌరా-డెహరడూన్ ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదంలో 7 గురు మరణించేరు.

రైళ్ళలో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే రైల్వే మంత్రి ప్రమాదంలో చనిపోయిన వారికి నష్టపరిహారం ప్రకటిస్తూ, ప్రమాద కారణాలు తెలుసుకోవడానికి విచారణ కమిటీ ఏర్పాటుచేస్తున్నామని, ఇకమీదట ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీలు కుమ్మరించి వెళ్ళిపోతారు.


రైల్వేశాఖ విచారణ మొదలుపెడుతుంది. విచారణ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు ప్రమాదానికి కారణాలూ, ఇక మీదట ఇలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా ఉండటానికి తీసుకోవలసిన చర్యలూ వీటిగురించి ఒక నివేదిక సమర్పిస్తుంది.

“కానీ జరుగుతున్నదేమిటంటే కమిటీ రెకమండ్ చేసిన చర్యలను రైల్వే శాఖ పూర్తిగా అమలుపరచదు. అందువలనే మళ్ళీమళ్ళీ రైళ్ళలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి అని” ఒక రైల్వే అధికారి తలియజేసేరు.

2013-2014 రైల్వే బడ్జెట్ లో అన్ని రైళ్ళలోనూ "స్మోక్ డిటెక్టర్లు" పెడతామని తెలిపేరు. 2 రాజధాణి రైళ్ళలో తప్ప మిగిలిన ఏ రైలులోనూ అమర్చలేదట. మంటలు అంటుకోని ఫర్నిచర్లు, మంటలు ఏర్పడినా వాటిని వెంటనే ఆర్పడానికి ఫైర్ ఎక్స్టిన్ గుషర్ల ను గార్డుల దగ్గర, బ్రేక్ వ్యాన్లలో, ఏసీ కోచ్లలో , పాంట్రీ కార్లలో ఏర్పాటుచేస్తామని చెప్పేరు. కనీసం వీటిని కూడా రైళ్ళలో ఉంచలేదు.

జర్మన్ టెక్నాలజీ పరిజ్ఞానంతో లింక్ హాఫ్ మన్ బుష్ (మంటలు చెలరేగినా, అవి వ్యాపించకుండా ఉండేదుకు)కోచ్ ల తయారీకి శ్రీకారం చుట్టేరు. ఆ తరువాత ఈ కోచ్ల గురించి తెలియలేదు.


భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యంత పెద్దదని చెప్పుకోవటం గొప్పకాదు. ఇంత పెద్ద రైల్వే లో అగ్నిప్రమాదాలే లేవని చెప్పుకోవాలి. కానీ 2012-2013 లో రైళ్లలో 8 అగ్నిప్రమాదలు జరిగినై అని రైల్వేశాఖే చెబుతోంది. ఇప్పుడు జరిగినదానితో కలిపి 9. కనీసం స్మోక్ డిటెక్టర్లును, ఫైర్ ఎక్స్టిన్ గుషర్లను రైళ్ళలో ఉంచలేకపోవటం......డబ్బులేక కాదు.... రైల్వేశాఖ నిర్లక్ష్యమే.

No comments:

Post a Comment