Friday, December 27, 2013

విమానాశ్రయాలలో హోల్ బాడీ స్కాన్....వీడియో

తీవ్రవాద కార్యకలపాలు రోజురోజుకూ పెచ్చరిల్లిపోతుండడంతో అన్ని దేశాల ప్రభుత్వాలు సెక్యూరిటీలో వినూత్న సంస్కరణలు చేపడుతున్నాయి. ముఖ్యంగా బస్‌ స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లు, విమానాశ్రయాలు.

ఇలా ప్రతిచోటా సెక్యూరిటీని పెంచి సోదా చేస్తున్నారు. ముఖ్యంగా విమానాశ్రయాల్లోనైతే ఇలాంటి సోదాలు మరీ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇదివరకటిలాగా సెక్యూరిటీ సిబ్బంది అణువణువునా తడుముతూ సోదా చేసే పరిస్థితులు ఇక దూరమైనట్లే. అత్యాధునిక టెక్నాలజీతో వచ్చిన స్కానర్లు... వ్యక్తి సహాయం లేకుండా అణువణువునా సోదా చేసేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం విమానాశ్రయాల్లో ప్రవేశపెట్టిన అత్యాధునిక స్కానింగ్‌ పరికరాలు క్షణాల్లో ఈ పనిని పూర్తి చేస్తున్నాయి కూడా. అయితే ఇలాంటి స్కానర్లతో లాభాలెన్ని ఉన్నాయో సమస్యలు కూడా అంతే ఉన్నాయంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

మన శరీరంలోని ప్రతి అవయవాన్నీ క్షుణ్ణంగా స్కాన్‌ చేస్తాయి ఈ ఫుల్‌ బాడీ స్కానర్లు... మనం వేసుకున్న దుస్తులు మచ్చుకు కూడా స్క్రీన్‌పైన కనపడవు. సెక్యూరిటీ అధికారులకు తెలియకుండా లోదుస్తుల్లో రహ స్యంగా ఉంచే ఆయుధాలను గానీ పేలుడు పదార్థాలుగానీ కనిపెట్టడం ఈ స్కానర్లకు క్షణాల మీది పని.

No comments:

Post a Comment