Friday, December 20, 2013

మరుగుతున్న నూనెలోనుండి చేతితో వేపుడు చేపలను తీస్తున్న డిల్లీ హోటల్ యజమాని.....ఫోటోలు మరియూ వీడియో

ఆశ్చర్యంగా ఉన్నది కదా...ఆశ్చర్యమే, చేతులా అవి లేక ఇనుప అట్లకాడలా?.... మరుగుతున్న నూనే వేడి కనీసం 200 డిగ్రీల సెలిసియస్ వేడి ఉంటుంది. అంత వేడిగల నూనెలో చేతులు పెట్టి, వేగిన చేప ముక్కలను తీయటం ఆశ్చర్యమే. ఆయన పేరు ప్రేం సింగ్. 65 సంవత్సరాల వయస్సు కలిగిన ఈయన పాత డిల్లీలో ఒక చిన్న హోటల్ పెట్టుకున్నారు. వేడివేడి నూనెలో చేతులు పెట్టి తీసే ఫ్రై చేపలను తినడానికి రోజూ చాలామంది ఈ హోటల్ కు వస్తారట. అంత వేడి నూనెలో చేతులు పెట్టినా ఆయన చేతులు కాలవట.ఈ హోటల్ వ్యాపారం పెరగడానికి ఇదీ ఒక కారణం.


No comments:

Post a Comment