Monday, December 2, 2013

అమెరికాలోని ఆకర్షణీయ నగరమైన లాస్ వెగాస్ ను చూద్దాం రండి...ఫోటోలు

లాస్ వెగాస్ నగరం అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన నగరం. క్లార్క్ కౌంటీ ఆరంభంలో ఉన్న ఈ నగరంలోని అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన వసతిగృహాలు ప్రంపంచ ప్రసిద్ధి కలిగి ఉన్నాయి. ఈ నగరం జూదగృహాలకు, అనేక ఇతర విలాసాలకు పేరొందిన ఆకర్షణీయ నగరం. వినోదాలకు, షాపింగ్ మరియు విలాసాలకు ఈ నగరం మిక్కిలి ప్రసిద్ధి. ఈ నరగరం వినోదాలకు అంతర్జాతీయ కేంద్రం. వసతిగృహాలు కలిగిన బృహత్తర జూదగృహాలు తదనుగుణ ఇతర వినోదాలు ఈ నగర ఆకర్షణీయ అంశాలు. ఇక్కడ ఉన్న అనేక రూపాలలో విలాస కార్యకలాపాలకు అనువైన వ్యాపారాల కారణంగా ఇది పాపాల నగరంగా పేరు పొందింది. ఇక్కడ ఆకర్షణీయమైన విద్యుదలంకరణ అనేక ఇతర ఆకర్షణలు జూదమాడే వారే కాక దేశవిదేశాల నుండి అనేకమంది దీనిని సందర్శిస్తుంటారు. ఇక్కడి ఆకర్షణలు చిత్ర రంగాన్ని మరియు దూరదర్శన రంగాన్ని కూడా తనవైపు తిప్పుకున్నాయి. లాస్ వెగాస్ స్ట్రిప్ వెలుపలి ప్రాంతంలో అంతటా అద్భుత విద్యుత్‌ దీపాలకరణలతో నిండి ఉంటుంది. నగరమంతా కూడా సాధారణంకంటే దీపాలంకరణ అధికమే. ఈ కారణంగా నగరం ప్రపంచంలో ప్రకాశవంతమైన నగరంగా పేరుపొందింది. అంతరిక్షంలో నుండి చూసినా ఈ నగరం ప్రకాశవంతంగా కనబడుతుందని ప్రతీతి.


No comments:

Post a Comment