Tuesday, December 10, 2013

సంగీతానికున్న శక్తి....ఫోటోలు

Eris mesenis అనే ఫోటోగ్రాఫర్ అక్టోబర్ 10, 2011 న లిబియాలో అంతర్యుద్ధం జరుగుతున్నపుడు తీసిన ఈ ఫోటోలో ప్రభుత్వ దళాలకూ, తిరుగుబాటుదారులకు తీవ్ర పోరాట సమయములో తిరుగుబాటుదారులను ఉత్సాహ పరచటానికి గిటారు వాడుతూ పాడుతున్న ద్రుశ్యం.

ఇటలీకి చెందిన పియానో వాద్యం స్పెషలిస్ట్ Konstanz టర్కీలో జరుగుతున్న కలవారాలను ఆపటానికి, టర్కీ వచ్చి,జనవరి 12,2013 న టస్కిం స్కవయర్ లో 13 గంటలసేపు ఆపకుండా పియానో సంగీతం అందించేడు. సంగీతం రాజకీయాలను మారుస్తున్నదనే నమ్మకం నాకున్నదని తెలిపిన అతని సంగీతం అక్కడ కలవారాలను తగ్గించినైయట. బల్గేరియాకు చెందిన Davide Martello ఈ ఫోటోను తీసేరు.


ఈ ఫోటోను Mikhail Evstafiev అనే ఫోటోగ్రాఫర్ తీసేడు. 1992 బోస్ నియా యుద్దంలో సరాజీవో నగరాన్ని చెజిక్కించుకునే ఉద్దేశముతో బోస్నియా ప్రజలు యుగస్లోవియా సేనలతో తలపడ్డారు. ఎన్నో ప్రాచీన భవనాలు యుద్దములో నాశనం అయ్యేయి. సుమారు 15,000 మంది ప్రాణాలు కోల్పోయేరు. చనిపోయిన వారి ఆత్మ శాంతి కొసం, మరియూ యుగస్లొవియా సేనలు దాడి ఆప్పాలనే ఉద్దేశముతో Vedran Smailović యుద్దములో కుప్పకూలిన ఒక లైబ్రరీలో కూర్చుని సంగీతం అందించేడట.

అడెలె గాయకురాలి పాటతో కోమా నుండి బయటపడిన 7 ఏళ్ల చిన్నారి: ఇంగ్లాండ్లో చార్లెట్టే నివే అనే 7 సంవత్సరాల చిన్నారికి, అరుదైన మెదడు జబ్బు వచ్చి 2 సార్లు మెదడు ఆపరేషన్ చేసేరు. ఆ చిన్నారి కోమాలోకెళ్లిపోయింది.చిన్నారి బ్రతకదని చెప్పేసేరు. ఏడుస్తున్న తల్లి ఇంగ్లాండ్ కు చెందిన ప్రసిద్ద గాయకురాలు అడెలె పాడిన "రోలింగ్ ఇన్ ద డీప్" అనే పాట ను పాడింది. చిన్నారిలో కదలికలు గమనించి, రోజూ ఆ పాటను తనకు సమయమున్నప్పుడల్లా పాడింది. చిన్నారి కోమాలోనుండి బయటపడింది. డాక్టర్లు ఆశ్చర్యపోయేరు. ఇది ఆప్రిల్ 13, 2012 న జరిగింది.

ఇంప్రూవ్ ఎవెరివేర్ అనే ఒక స్టేజ్ మ్యూజిక్ సంస్థ సెప్టంబర్ 24, 2013 న న్యూయార్క్ నగర వీధిలో కూర్చుని "ఎవరైనా సరే మాతో సంగీత ప్రయోగం చేసుకోండి" అనే ప్రకటన చేసేరు. ఈ ప్రకటనను చూసి ఎంతోమంది ప్రజలు అక్కడకు వచ్చి సంగీత సాగరంలో కొంత సేపు మునిగిపోయేరట. "దీని వలన ప్రజలలో/మనుష్యులలో ప్రశాంతత ఏర్పడి వారికి పదునైన ఆలోచనలు వస్తాయి" అని ఆ స్టేజ్ టీం లీడర్ అన్నారు. ఈ క్రింది వీడియో చూస్తే మీకూ ఆనందం కలుగుతుంది.


యూక్రైన్ లో వేలాది మంది ప్రజలు వారి దేశ ప్రెశిడెంట్ రాజీనామాచేయాలని పోరాటాలు చేసేరు. ఎందుకంటే వారి ప్రెశిడెంట్ రష్యా దేశానికి లోబడి యూరోపియన్ యూనియన్ తో వ్యాపార సంబంధాల ఒప్పుదలను అంగీకరించలేదు. దీని వలన యూక్రైన్ దేశానికి చాలా నష్టం జరుగుతుందని, కాబట్టి ఒప్పుదలను అంగీకరించాలని లేకపోతే రాజీనామా చేయాలని పోరాటం చేసేరు. Andrew Meakovski అనే ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటోలో Markiyan Matsekh అనే సంగీత కళాకారుడు పోరాటాలకు మద్దత్తు తెలుపుతూ పోలీసుల ఎదురుగా సంగీత పోరాటం చేసేడు. దీని వలన యూక్రైన్ రాజకీయ నాయకులలో మార్పు వచ్చిందని చెబుతున్నారు.

No comments:

Post a Comment