Monday, December 16, 2013

సహారా ఏడారిలో తీవ్రవాదులచే పేల్చేసిన యూ.టీ.ఏ 772 విమాన స్మారక చిహ్నం/18 వ వార్షికోత్సవం.....ఫోటోలు

సెప్టంబర్ 19,1989 న రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశములోని బ్రాజ్విల్లే నగరం నుండి ఫ్రాన్స్ దేశములోని ప్యారీస్ నగరానికి యూ.టీ.ఏ 772 విమానం 155 మంది ప్రయాణీకులూ మరియూ 15 మంది సిబ్బందితో బయలుదేరింది. లిబియాకు చెందిన 6 తీవ్రవాదులు కూడా ఆ విమానంలో ఉన్నారు. సహారా ఎడారి ప్రాంతంలో ఒక సూట్కేసు బాంబుతో ఆ విమానాన్ని తీవ్రవాదులు పేల్చివేసేరు. అందరూ మరణించేరు. చనిపోయిన వారి కుటుంబీకులు ప్రతి సంవత్సరమూ విమానం పేలి పడిపోయిన చోటుకు వెళ్ళి మరణించిన వారికి శ్రద్దాంజలి ఘటిస్తారు. విమానం పడిపోయిన చోట ఒక స్మారక చిహ్నం ఏర్పాటుచేసేరు. ప్రపంచములోనే ఎవరూ ఎక్కువగా వెళ్లలేని స్మారక చిహ్నం ఇదే.

పేలిపోయిన విమానం ముక్కలు

స్మారక చిహ్నం కడుతున్నప్పుడు

18 వ వార్షికోత్సవం శ్రద్దాంజలికి వచ్చిన వారు.

No comments:

Post a Comment