Sunday, December 29, 2013

ధనవంతులైన బ్లాగర్లు: 2013 లో తమ బ్లాగ్ మూలం లక్షలు సంపాదించిన/సంపాదిస్తున్న బ్లాగర్లు...ఫోటోలు

1.Pete Cashmore: ప్రపంచములోనే ధనవంతుడైన బ్లాగర్ ఇతనే. ఇతను సోషియల్ మీడియా మరియూ టెక్నాలజీ గురించి బ్లాగు రాస్తాడు. Mashable అనే బ్లూగు రాస్తున్న ఇతను అతికొద్ది కాలంలోనే, అందులోనూ అతి చిన్న వయసులోనే తన బ్లాగు మూలంగా ప్రశిద్ది చెందేడు. బ్లాగుల ప్రపంచములోనే ఇతని బ్లాగే అత్యధికమైన వారు చదువుతున్నారు. తన బ్లాగుమూలముగా ఇతను నెలకు సుమారు రూ.8 కోట్లు సంపాదిస్తున్నాడు.
2.Michael Arrington: TechCrunch అనే బ్లాగును (టెక్నాలజీ గురించి) రాస్తూ, ఇతను నెలకు రూ.5 కోట్లు సంపాదిస్తున్నాడు.
3.Perez Hilton: ఇతను సెలెబ్రిటీ న్యూస్ మరియూ కుంభకోణాల గురించి రాస్తాడు. ఇతని సంపాదన నెలకు రూ.2 కోట్లు.
4.Vitaly Friedman: Smashing Magazine అనే పేరుతో ఇతను రాస్తున్న బ్లాగు వెబ్ డెవెలప్మెంట్ గురించి. వెబ్ సైట్ ఎలా రూపొందించాలో వివరనలు అందించే ఇతని బ్లాగు కూడా చాలా ప్రశిద్ది చెందింది. ఇతని సంపాదన నెలకు రూ. 1.5 కోట్లు.
5.Timothy Sykes: Timothy Sykes అనే పేరుతోనే ఇతను బ్లాగు ఉంటుంది. ఇతను స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి రాస్తాడు. ఇతను కూడా నెలకు రూ. 1.5 కోట్ల దాకా సంపాదిస్తాడట.
6.Jake Dobkin: Gothamist అనే బ్లాగును రాస్తున్న ఇతను నెలకు రూ.1 కోటి దాకా సంపాదిస్తాడట. ఎక్కువగా న్యూయార్క్ నగరం గురించి, అక్కడి లైఫ్ స్టైల్ గురించి, అక్కడి హోటల్ల గురించి రాస్తాడు.
7.Collis Taeed: TutsPlus పేరుతో ఇతను రాస్తున్న బ్లాగు మూలంగా సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ మరియూ డిజైన్ టూల్స్ ను ఎలా వాడుకోవాలో వీడియో మూలముగా తన బ్లాగులో చెబుతాడు. ఇతని వీడియోలు చూసి, ఇతను చెప్పిన విధముగా చేస్తే ఫోటో మరియూ వీడియో ఎడీటింగ్ ఎవరైనా చేయవచ్చునట. ఇతను తన బ్లాగు మూలం నెలకు రూ. 80 లక్షలు సంపాదిస్తాడు.
8.Gina Trapani: Life Hacker అనే బ్లాగు మూలముగా ఒకరు తమ పర్సనాలిటీ డెవెలప్మెంట్ ఎలా పెంచుకోవాలో, తమల్ని తాము ఎలా అభివ్రుద్ది చేసుకోవాలో వివరిస్తారు. ఈమె తన బ్లాగు మూలముగా నెలకు రూ. 70 లక్షలు సంపాదిస్తోందట. ప్రపంచములోని మహిళా బ్లాగర్లలో బ్లాగు మూలం ఎక్కువ సంపాదిస్తున్న మహిళ ఈమేనట.
9.Matt Marshall: Venture Beat అనే పేరుతో ఉన్న ఇతని బ్లాగు కూడా టెక్నాలజీ గురించే. దానితో ఎలా వ్యాపారం చేయడం, పెట్టుబడులు పెట్టడం, లాభాలు చేసుకోవడం గురించి రాస్తాడు. ఇతను నెలకు రూ.60 లక్షలు సంపాదిస్తాడు.
10.Ewdison Then: Slashgear.com అనే పేరుతో ఇతను రాస్తున్న బ్లాగు కూడా టెక్నాలజీ గురించే అయినా ఇతను ఎక్కువగా వాడకంలో ఉన్న ఎలెక్ట్రానిక్స్ గాడ్జెట్ల గురించి రాస్తాడు. ఇతను నెలకు రూ. 50 లక్షలు సంపాదిస్తాడట.

No comments:

Post a Comment