Friday, December 13, 2013

2011 లో రూ.4 లక్షల కోట్ల బ్లాక్ మనీ భారతదేశం నుండి తరలించబడింది....న్యూస్

భారతదేశం నుండి 2011 లో చట్ట్విరుద్దంగా రూ. 4లక్షల కోట్ల డబ్బును విదేశాలకు తరలించేరని అంతర్జాతీయ నిఘా సంస్థ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ తన రిపోర్టులో తెలిపింది. ఇది పోయిన సంవత్సరం(అంటే 2010) కంటే 24 శాతం అధికమట.


చట్టవిరుద్దముగా తరలించబడ్డ ఈ సొమ్ము భారతదేశ 2011 బడ్జెట్( బడ్జెట్: రూ.13 లక్షల కోట్లు) లో సుమారు 30 శాతం ఉంటుందట. ఈ తరలించబడ్డ డబ్బు భారదేశ కేంద్ర ప్రభుత్వం తమ ఆరొగ్య పధకాలకు ఖర్చుపెట్టే డబ్బుకంటే 14 రెట్లు ఎక్కువట. చదువుల పధకాలకు ఖర్చుపెట్టే డబ్బు కంటే 7 రెట్లు ఎక్కువట. గ్రామ అభివ్రుద్ది పధకాల ఖర్చుకంటే 5 రెట్లు ఎక్కువట.


గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ పనులలో మెగా స్కాములు జరిగినై అనేది మీకందరికీ తెలుసు. కామన్వెల్త్, 2G, కోల్ గేట్, మహా ఇరిగేషన్ మరియూ జార్కండ్ మైనింగ్. దీనితో అన్నా హజారే లాంటి వారు అవినీతిపై పోరాటం జరిపేరు. ఎన్ని పోరాటాలు జరిగినా అవినీతి పెరిగిందే గాని కొంచం కూడా తగ్గలేదని GFI రిపోర్ట్ తెలుపుతోంది.


2002 నుండి 2011 వరకు భారతదేశం రూ.15.7 లక్షల కోటల డబ్బును కోల్పోయింది.

భారదేశంలో ఏది అభివ్రుద్ది చెందుతోందో లేదో ఖచ్చితంగా చెప్పలేము. కానీ చట్ట విరుద్దంగా డబ్బును మనదేశం నుండి ఇతర దేశాలకు తరలించే విషయంలో మాత్రం అభివ్రుద్ది కనిపిస్తొంది.

No comments:

Post a Comment