Saturday, November 9, 2013

తాయ్ లాండ్ లో జరిగిన వెజిటేరియన్ పండుగ సంబరాలు (హెచ్చరిక:ఫోటోలు మరియూ వీడియో కలతపెట్టవచ్చు)....ఫోటోలు మరియూ వీడియోలు

ప్రతి సంవత్సరమూ అక్టోబర్ నెలలో 9 రోజులు జరిగే ఈ పండుగలో తనకుతాను కొంతైన అవయవ నష్టం చేసుకుంటే తమ శరీరాలు పరిశుద్దమౌతాయని నమ్ముతారు. ఇందులో ఎలాంటి గారడీలూ లేవని, అంతా నిజంగానే జరుగుతాయని ఆ దేశ టూరిజం డిపార్ట్ మెంట్ చెబుతోంది. కొన్ని వేల మంది ఈ పండుగులో పాల్గొంటారు. సంవత్సరమంతా మాంసం తింటూ ఉండే వీరు, అలా తినడంవలన తమ శరీరములో దుష్ట శక్తులు ప్రవేశించే అవకాశం ఉన్నదని, వాటిని తరిమికొట్టటానికే ఈ 9 రోజుల పండుగ చేసుకుంటామని చెబుతారు. ఆ దుష్ట శక్తులను తరిమికొట్టడానికి తమ శరీరంలో కొంతైన అవయవ నష్టం చేసుకోవాలని, అప్పుడే దుష్ట శక్తులు తమల్ని క్షమించి వెళ్ళిపోతాయని నమ్ముతారు. ఈ 9 రోజులూ పూర్తిగా శాఖాహార ఆహారమే తింటారు.



1 comment:

  1. every one on this earth must become a Veg... soon.
    operation is start that is www.pssm.org

    ReplyDelete