Tuesday, November 5, 2013

అత్యంత ఖరీదైన పూవులు....ఫోటోలు

ఏ సంబరమైన పూవులులేనిదే పూర్తి కాదు. అది పెళ్ళి కానివ్వండి, పుట్టినరోజు వేడుక కానివ్వండి,చనిపోయినప్పుడు కానివ్వండి లేక ప్రేమ చెప్పేటప్పుడు కానివ్వండి. ఎందుకంటే పూవులను ఎవరికి అందించినా అది వారి హ్రుదయాన్ని కదిలిస్తుంది. మరొక ముఖ్య విషయం అవి తక్కువ ఖరీదుకే మనకు దక్కుతాయి.

కానీ మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ జేబులను కాళీచేసే పూవులున్నాయని తెలుసుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయేను. ఈ అరుదైన పూవుల వెల ఒక పూవుకు లక్షలూ, కోట్లూ ఉంటుందట. మీరెప్పుడైనా "కినబలూ బంగారు పూవు" పేరు విన్నారా? ఇది మలేషియాలోని నేషనల్ పార్కులో మాత్రమే దొరుకుతుందట. పోనీ "కడుపుల్" పూవు పేరు విన్నారా...ఇది మధ్యరాత్రి సమయములో విరబూసి, తెల్లవారేటప్పటికి వాడిపోతుందట.

అలాంటి కొన్ని ఖరీదైన పూవుల గురించి తెలుసుకుందాము.

LISIANTHUS.....దీనిని సైన్స్ లో Eustoma grandiflorum అంటారు. దీని వెల రూ.500 నుండి రూ.1600 దాకా ఉంటుందట.
LILY OF THE VALLEY.....సైన్స్ పేరు Convallaria majalis...దీని వెల రూ.750 నుండి రూ.2000 దాకా ఉంటుంది.
GLOROSIA....దీని వెల రూ.300 నుండి రూ.500 దాకా ఉంటుందట.
HYDRANGEA....ఒక పూవు వెల రూ.350.
17TH CENTURY TULIP BULB.....17 వ శతాబ్ధములోనే ఈ పువ్వు ఖరీదు రూ.3000. ఆ రోజుల్లో ధనవంతులే దర్జాకోసం పెట్టుకునేవారట. ఈ రోజు ఈ పూవు వెల రూ.45,000.
SAFFRON CROCUS.....ఇది ఒక అత్యద్భుతమైన పూవట. వంట వారు ఎక్కువగా వాడుతారట. పూవు మధ్యలో ఉన్న పరికలు అత్యంత సువాసనగా ఉండటంతో, వంటలలో వేసేవారట. దీని ఖరీదు ఒక కిలో రూ.60,000.
GOLD OF KINABALU ORCHID...ఒక పూవు ఖరీదు రూ.35,000. ఇది అరుదైన పూవు మాత్రమే కాకుండా, ఈ చెట్టును పెంచడం కూడా చాలా కష్టమట. అల్ల పెంచిన ఒక పూవు పూయడానికి 15 సంవత్సరాలు పడుతుందట.
SHENZHEN NONGKE ORCHID....ఇది మనుష్యులచే కొత్తగా అంటే 2005 లో పరిశోధనచేసి పండిచబడ్డ పూవు. చైనా రైతు సంఘాల సమ్మేళనలో అగ్రికల్చర్ యూనివర్సిటీ రూపొందించిన పూల చెట్టు. ఈ పూల చెట్టుకు 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ పూవు పూస్తుంది. అందుకని దీనీని వేలం పాటతో అమ్ముతారు. చివరిసారి వేలం పాటలో ఒక పువూను రూ.10 లక్షలకు కొనుకున్నారు.
JULIET ROSE.....ఈ పూవు పూసే చెట్టును 15 సంవత్సరాల పరిశొధన తరువాత, 3మిల్లియన్ పౌండ్ల ఖర్చుతో తయారైన చెట్టు కావడంతో, ఈ పూవుకు 3 మిల్లియన్ పౌండ్ల పువ్వు అనే పేరు కూడా ఉంది. దీని ప్రస్థుత ఖరీదు ఒక పూవు రూ.8,000.
KADUPUL FLOWER.....ఇది శ్రీలంకలో మాత్రమే దొరుకుతుంది. దీనికి ఖరీదు కట్టలేరు. ఆమొఘమైన సువాసన కలిగిన ఈ పూవు మధ్యరాత్రి వికసించి, తెల్లవారేలోపు వాడిపోతుంది. దీనిని చెట్టునుండి వేరుచేయడం కూడా కష్టమట.

No comments:

Post a Comment