Saturday, November 2, 2013

ఒక కోటీశ్వరడు తన కోట్ల విలువచేసే కారును పూడ్చిపెట్టేడు...దీనికి ఆయన చెప్పిన కారణం అత్యంత ఆసక్తి కలిగిస్తుంది....ఫోటోలు

"నేను ఇంత విలువచేసే ఖరీదైన కారును పూడ్చిపెట్టబోతాను అని తెలిపినప్పుడు, పూడ్చిపెడుతుంటే నన్ను అందరూ ఎగతాలి చేసేరు. ఇంత ఖరీదైన కారును పూడ్చిపెట్టమేమిటి? దానిని ఆయన ఎవరికైన దానం ఇవ్వవచ్చు కదా? అని అడిగేరు. నేను ఎందుకు ఇంత ఖరీదైన కారును పూడ్చిపెడుతున్నాను....దానికి కారణమేమిటో చెబుతాను వినండి: విలువ కట్టలేని, మరో మనిషికి ఉపయోగపడేవి అయిన మానవ అవయవాలను చనిపోయినతరువాత కూడా దానం చేయకుండా పూడ్చిపెడుతున్నారు. అటువంటప్పుడు విలువకట్టగల ఖరీదైన కారును పూడ్చిపెడుతే తప్పేముంది. "అవయవ దానం" ఎంత పెద్ద దానమో, ఎంత ముఖ్యమైన దానమో, ఎంత అవసరమైన దానమో ప్రజలందరికీ తెలపాలనే నేను నా కారును ఈ రోజు పూడ్చిపెడుతున్నాను" అని తెలియజేసేరు".....గ్రేట్.



No comments:

Post a Comment