Saturday, November 16, 2013

బొలీవియా దేశంలో జరిగే పుర్రెల దినం.....ఫోటోలు

దక్షిణ అమెరికా లోని మధ్యప్రాంతంలో గల ఈ దేశం ప్రతి సంవత్సరం పుర్రెల దినం జరుపుకుంటుంది. చాలామందికి ఇది ఒక భయంకరమైన సినిమాలోని సీనులాగా కనబడుతుంది. కానీ బొలీవియా దేశ ప్రజలకు ఇది ఒక సాంప్రదాయాం. ఆ రోజున ఈ దేశములోని ప్రజలు పుర్రెలను పూవులతో అలంకరించి,వాటికి నైవేద్యం సమర్పించుకుని ఊరేగింపుగా తీసుకు వెడతారు.

బొలీవియా ప్రజలు ప్రతి మనిషికి 7 ఆత్మలు ఉంటాయని నమ్ముతారు. అందులో ఒకటి పూడ్చిపెట్టిన శవంలో ఉంటుందని నమ్ముతారు. అందువలన ప్రతి సంవత్సరం ఒక రోజున తమ సొంత వారిని పూడ్చిపెట్టిన సమాధులను తవ్వి అక్కడున్న పుర్రెలను బయటకు తీసి వాటిని అలంకరించి, ప్రసాదాలతో గౌరవించి, చాలావరకు శ్మశానంలోనే ఊరేగింపుగా తీసుకు వెడతారు. అలాచేస్తే బ్రతికున్నవారికి మంచి జరుగుతుందని వారి నమ్మకం. ఆ రోజు ఆ దేశములో ప్రభుత్వ సెలవు దినం.


No comments:

Post a Comment