Sunday, November 17, 2013

హైయన్ తుఫాన తాకిడి జరిగిన వారం రోజుల తరువాత ఫిలిప్పీన్స్....వివరాలూ మరియూ ఫోటోలు

హైయన్ తుఫాను (ఫిలిప్పీన్స్ లో "టైఫూన్ యొలాండా" గా పిలుస్తారు) అనేది అనధికారికంగా అత్యంత బలమైన తుఫానుగా నమోదు చేయబడిన తుఫాను. ఇది భూమి పై 315 km/h (195 mph) వేగం గలిగిన పెద్ద తుపాను. ఇది "2013 పసిఫిక్ తుపాను కాలం" లో 13 వ తుఫానుగా నమోదు చేయబడినది. ఈ తుఫాను నవంబరు 2 న ఫెడరేటెడ్ స్టేట్ ఆఫ్ మైక్రోనేసియా లోని పోన్పై కు కొన్ని వందల కిలోమీటర్ల ఆగ్నేయంగా అత్యల్ప పీడనం తో ప్రారంభమైనది. ఇది ఆ తర్వాత ట్రాపికల్ తుఫానుగా తయారైన తర్వాత నవంబర్ 4 వ తేదీ 000 UTC లకు దీనికి "హైయన్" గా నామకరణం చేశారు. ఇది నవంబర్ 5 వ తేదీ 1800 UTC లకు తీవ్రరూపం దాల్చి శరవేగంతో ఉధృతంగా తయారైనది. నవంబర్ 6 న జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ (JTWC) దీనిని ఐదవ వర్గం సూపర్ తుఫానుగా సాఫిర్ సింప్సన్ హరికేన్ విండ్ స్కేలుపై నమోదు చేసింది. ఈ తుఫాను బలం పొందిన తర్వాత పలావ్ లోని కయాంజెల్ మీదుగా ప్రయాణించినది. ఆ తర్వాత ఇది తీవ్ర రూపంలో కొనసాగి నవంబర్ 7 వ తేది 200 UTC లకు జపాన్ మెటొరాజికల్ ఏజెన్సీ (JMA) దీని గాలితీవ్రతను పది నిమిషాల గాలి ప్రవాహాలు 315 km/h (195 mph) వేగంతో ఉన్నట్లు నవీకరించారు. అనధికారికంగా "హైయన్" నిరంతరం పరిశీలించిన తుఫానులలో నాల్గవ అత్యంత తీవ్ర ఉష్ణ తుఫానులగా తయారైనది. అనేక గంటల తర్వాత ఈ తుఫాను ఫిలిప్పీన్స్ లో గుయన్, తూర్పు సమర్ ప్రాంతంలో తీరం దాటినది. తీరం దాటిన సందర్బంలో కూడా దాని తీవ్రత తగ్గలేదు. పరిశీలిస్తే "హైయన్" తుఫాను తీరం దాటిన బలమైన తుఫానుగా రికార్డులకెక్కింది. ఇది వరకు 1969 అట్లాంటిక్ హరికేన్ కాలం లో 305 km/h (190 mph) వేగంతో ఉన్న తుఫాను రికార్డును ఈ "హైయన్" తుఫాను అధికమించింది. క్రమంగా బలహీనపడి ఈ తుఫాను ఐదు ద్వీపాల భూభాగాలలో తీరందాటి దక్షిణ చైనా సముద్రం గుండా పోయినది. ఇది నైరుతి దిశగా తిరిగి ఉత్తర వియాత్నాం లో నవంబర్ 10 న ప్రమాదకర తుఫానుగా ప్రవేశించింది. ఈ తుఫాను ఫిలిప్పీన్స్ లో తీవ్ర నష్టం కలిగించింది. ప్రత్యేకంగా సమార్ ద్వీపం మరియు లేటే ప్రాంతాలు ఈ తుఫాను ధాటికి అతలాకుతలం అయినవి. ఆ ప్రాంత గవర్నర్ అంచనాల ప్రకారం ఒక్క టాల్కోబాన్ లోనే 10,000 వరకు మరణాలు సంభవించినట్లు తెలిసింది.

భయంకర తుఫాను హైయన్ ధాటికి ఫిలిప్పైన్స్ విలవిలలాడింది. ఈ పెను తుఫాను ధాటికి 10,000 మందికి పైగా మరణించి ఉంటారని భయపడుతున్నారు. ఒక్క లేటి ద్వీప రాష్ట్రంలోనే 10,000 మందికి పైగా మరణించారని, సమర్ ద్వీపంలో మరణాలు కూడా కలుపుకుంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఫిలిప్పైన్స్ అధికారులు చెబుతున్నారు. లేటే రాష్ట్రం మొత్తం దాదాపు నాశనం అయిందని స్ధానిక అధికారులను ఉటంకిస్తూ "రష్యా టుడే" లో తెలిపింది. లేటి రాష్ట్రంలో 80 శాతం భాగం పూర్తిగా ధ్వంసం అయిందని ఆ రాష్ట్ర చీఫ్ సూపరింటెండ్ ఎల్మర్ సోరియా చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. చనిపోయినవారిలో అత్యధికులు నీళ్ళలో మునిగిపోవడం వలన గానీ, భవనాలు కూలిపోవడం వలన గానీ చనిపోయారని ఫిలిప్పైన్స్ అధికారులు చెప్పారు. టాక్లోబన్ నగర అధికారి టెక్సన్ లిమ్ ప్రకారం ఒక్క టాక్లోబన్ నగరంలోనే మరణాల సంఖ్య 10,000 దాటుతుంది (ఎ.ఎఫ్.పి).

ఫిలిప్పైన్స్ హోమ్ కార్యదర్శి (మన హోమ్ మంత్రితో సమానం) మార్ రోగ్జాస్ పరిస్ధితిని “భయంకరం” గా అభివర్ణించాడు. ఈ తుఫాను తాకిడి వల్ల ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా మృత కళేబరాలే. ఆధునిక జీవనానికి సంబంధించిన అన్నీ సౌకర్యాలూ, వ్యవస్ధలూ -సమాచార వ్యవస్ధ, విద్యుత్, నీటి సరఫరా- నాశనం అయ్యాయి. మీడియా కూడా పని చేయకపోవడంతో ప్రజలను సామూహికంగా సహాయంకోసం సంప్రదించే మార్గం లేకుండా పోయింది. ఇంత భారీ స్ధాయిలో ప్రజలు చనిపోవడం ఫిలిప్పైన్స్ లో ఇదే ప్రధమం. ఫిలిప్పైన్స్ చరిత్రలోనే ఇంత భారీ జన, ధన, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.


No comments:

Post a Comment