Monday, November 25, 2013

గంగా నది తీరాన్ని ఖచ్చితంగా శుభ్రపరుచుకోవాలి.....ఫోటోలు

ఎన్నో దేశాలలో జన సమూహం కూడే ప్రదేశాలలో శుభ్రత కు ఎక్కువ ప్రాధన్యం ఇస్తారు. కానీ మనదేశములోని అతి ముఖ్యమైన, పవిత్రమైన, అత్యధిక జనాభా కూడే ప్రదేశమైన గంగా నదీ తీరాన్ని శుభ్రముగా ఉంచుకోవాలనుకోవడములో ఎనుదుకు ప్రభుత్వం శ్రద్దచూపటంలేదో అర్ధంకావటంలేదు.

గంగానది భారతదేశంలోను, బంగ్లాదేశ్‌లోను ప్రధానమైన నదులలో ఒకటి. భారతదేశం ఆర్ధిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడివడి ఉన్నాయి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగా భవాని" అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. "నీరు" అన్న పదానికి సంస్కృతంలో "గంగ" అన్న పదాన్ని వాడుతారు.

గంగా నది మొత్తం పొడవు షుమారు 2,510 కి.మీ.(1,557 మైళ్ళు). గంగ, దాని ఉపనదియైన యమున కలిసి విశాలమైన మైదానప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. సారవంతమైన ఈ "గంగా-యమునా మైదానం" ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌లలో విస్తరించి ఉన్నది. మొత్తం ప్రపంచ జనాభాలో 8.5 % ప్రజలకు (ప్రతి 12 మందికీ ఒకరికి) ఈ మైదానం నివాసస్థానం. ఈ కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రమైన ఆర్ధిక, పర్యావరణ, సాంఘిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.


No comments:

Post a Comment