Sunday, November 10, 2013

అత్యంత ఖర్చైన భీమా లు(ఇన్ స్యూ రన్స్ క్లెయిములు)....ఫోటోలు

భీమా పధకాలను సరిగ్గా ఉపయోగించుకునే వారు తెలివిగా లాభకరమైన వ్యాపారం చేస్తున్నట్లే. ఎన్నో రకాల భీమా పధకాలు అమలులో ఉన్నాయి. వాటిని తెలుసుకుని వాటిలో తమకు ఉపయోగపడే భీమా పధకాలను ఎంచుకుని ఆ పధకాలలో పెట్టుబడులు పెడితే అవసరమైన సమయాలలో అవి ఆదుకొనడమే గాకుండా, చివరివరకు మనిషికి తోడుగానూ ఉంటాయి.

న్యాయ శాస్త్రం మరియు అర్థ శాస్త్రం ప్రకారం ఆపద వలన సంభవించే నష్టాన్ని నివారించేందుకు ప్రాథమికంగా ఉపయోగించే ఆపద నిర్వహణి, బీమా అంటారు. బీమా అనే దాన్ని ప్రీమియంకు బదులుగా ఒక సంస్థ యొక్క నష్టాన్ని మరొక సంస్థకు సమానంగా బదిలీ చేసేదిగా నిర్వచించవచ్చు. భారీగా వచ్చే నష్టాన్ని నివారించేందుకు చిన్న నష్టంతో సరిచేస్తుంది. బీమాను విక్రయించే కంపెనీని బీమా సంస్థగా ; బీమా కొనేవారిని బీమాదారు లేక పాలసీ కలిగినవారు గా పిలుస్తారు. బీమా పరిధిని పొందడానికి చెల్లించాల్సిన రుసుము అనగా ప్రీమియం ను లెక్కకట్టడానికి బీమా నిష్పత్తి ని ఉపయోగిస్తారు. ఆపద ను అంచనా వేయటం మరియు ఆపద నివారణను ఆచరణలో పెట్టే ఆపద నిర్వహణ విశేషమైన అధ్యయన రంగంగా అవతరించింది.

ఈ మధ్య ఎన్నో అసాధారణ సంఘటనలు ఏర్పడుతూ ఎంతో నష్టాన్ని ఏర్పరుస్తోంది. వీటి నుండి నివారణ పొందాలంటే తప్పక భీమాలు చేయించుకోవాల్సిందే.

Hurricane Katrina......నష్టపోయిన ప్రదేశాలు Bahamas, Cuba, USA...భీమా పధకం క్రింద ఇచ్చిన మొత్తం 72.3 బిల్లియన్ డాలర్లు.

9/11 World Trade Centre disaster...నష్టపోయిన ప్రదేశాలు .....New York, USA.....40 బిల్లియన్ డాలర్లు

Hurricane Andrew......నష్టపోయిన ప్రదేశాలు.... Bahamas, Southern USA....30 బిల్లియన్ డాలర్లు
Tohoku earthquake and tsunami.....నష్టపోయిన ప్రదేశాలు............... Japan...... 14.5 ---34.6 బిల్లియన్ డాలర్లు

Northridge earthquake......నష్టపోయిన ప్రదేశాలు......... United States of America .......20.6 బిల్లియన్ డాలర్లు


No comments:

Post a Comment