Friday, November 1, 2013

ప్రపంచములోనే ఎత్తైన విగ్రహం ఏర్పాట్లు :.సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం.....ఫోటోలు మరియూ వీడియో

ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఐక్యతకు చిహ్నమని, చాణుక్యుడి తర్వాత దేశాన్ని ఐక్యం చేసిన ఘనత ఆయనదేనని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. గురువారం పటేల్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహ నిర్మానానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడుతూ సర్దార్ సరోవర్ జలాశయం వల్లభాయ్ పటేల్ కలని, సర్దార్ సరోవర్ జలాశయం ద్వారా రైతులు, గిరిజనులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని అన్నారు.

గుజరాత్ ప్రభుత్వం సాగు, తాగునీటి కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మోడీ పేర్కొన్నారు. పటేల్ విగ్రహ ప్రాజెక్టు కోసం గరుడేశ్వర్ అనే కొత్త తాలూకా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. దేశం నలుమూలలా ఐక్యత మంత్రాన్ని చాటుదామని మోడీ పిలుపునిచ్చారు. నర్మదా నది ఒడ్డున ఇవాళ కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నామన్నారు. ఈ కార్యక్రమం చేపట్టేందుకు తనకు ఎంతోమంది స్ఫూర్తినిచ్చారన్నారు. వాజపేయి నాయకత్వంలో అణు పరీక్షలు నిర్వహించి సార్వభౌమత్వాన్ని చాటామని మోడీ చెప్పారు. నాటి నాయకులు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదని దేశానికి ప్రతీకలన్నారు.


1 comment:

  1. Great deed indeed. Let the country come out of the obsession with one lousy set of people. Atleast let the people of India not chemchas although a particular strain of politicians are born chemchas.

    ReplyDelete