Wednesday, November 20, 2013

స్వాధీనం చెసుకున్న 6 టన్నుల ఏనుగు దంతములతో చెక్కిన వస్తువుల నాశనం....ఫోటోలు

అమెరికా అధికారులు చట్ట విరుద్దంగా తరలించిన ఏనుగు దంతాలతో తయారుచేసిన వస్తువులను జప్తుచేసి, వాటన్నింటినీ ఒకచోటికి చేర్చేరు. వాటి మొత్త బరువు 6 టన్నులు. ఈ 6 టన్నుల ఏనుగు దంతాల వస్తువులను ఒక మిషెన్ అధారంతో నుసిచేసి పొడిచేసేరు. జీవహింస నివారణ, జంతు సంరక్షణ ప్రపంచానికి చాటి చెప్పాలనే ఇలా చేస్తున్నట్లు అమెరికా జీవకారుణ్య సంఘం తెలిపింది.

ఈ విశ్వంలో కేవలం మనిషికే కాదు.జంతువులకూ, పక్షులకూ హక్కులుంటాయి. అయితే మనిషి తాననుకున్నది నోరు పెట్టి సాధించుకుంటే పశుపక్షాదులు ఆ పని చేయలేవు... అందుకే వాటిని మూగ జీవాలంటాం. మనిషి హక్కులకి ఉల్లంఘన జరిగితే... ఉద్యమించేవారు బోలెడు మంది ఉన్నారు... అందుకు మానవ హక్కుల సంఘాలూ ఉన్నాయి.కానీ నోరులేని జీవాల హక్కులకు భంగం వాటిల్లితే.... వాటికి అరణ్యరోదనే. అయితే కాలానుగుణంగా ఈ జీవాల హక్కుల్ని కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా జీవకారుణ్య సంఘాలు పుట్టుకొచ్చాయి. వాటికి అండగా నిలచేందుకు అనేక మంది నడుం బిగించినా... వీరు చేస్తున్న పోరాటాల ప్రభావం చాలా స్వల్పంగానే కనిపించడం ఆందోళనకరం.

మనిషికీ.. మనిషికీ వైరం పెరుగుతున్నా... చాలా సందర్భాలలో జంతు వులే మానవాళికి అండగా నిలబడుతున్నాయన్న విషయాన్ని గమనిం చిన జంతు ప్రేమికులు సాధు జంతువులు, పక్షులనే కాదు, కౄర జంతు వుల పాలిట కూడా తమ మమకారాన్ని చూపిస్తూ... మానవ మృగాల వేటలో అంతరించి పోతున్న జీవుల సంరక్షణకు నడుంబిగించి... వాటిపై మక్కువ పెంచుకునేలా సమాజంలో మార్పులు తీసుకువచ్చేందుకు అనేక మంది కృషి చేస్తున్నారు. సాటి మనిషినే కాదు... మీకు దగ్గరలోని ఉన్న జీవాలనీ హింసించవద్దంటూ చేస్తున్న ప్రచారం కొంతమేరైనా చైతన్యానికి నాంది పలుకుతోందనే చెప్పక తప్పదు.


No comments:

Post a Comment