Tuesday, November 19, 2013

6 గంటలకొకసారి నగరాలలోకి వచ్చే సముద్రపు నీరు.....ఫోటోలు

వెనిస్ ఇటలీ దేశంలో గల ఒక నగరం పేరు. ఇది నీటిపై తేలియాడే నగరం గా ప్రసిద్ధి గాంచింది.వెనిస్ నగరం ఏడ్రియాటిక్ సముద్రంలో 118 చిన్న దీవుల, మరియు వెనీషియన్ లాగూన్ యొక్క సముదాయం. ఈ లాగూన్ దక్షిణాన పో మరియు ఉత్తరాన పియావె అనే నదుల మధ్య విస్తరించి ఉంది. చంద్రుని ఆకర్షనా శక్తి వలన అక్టోబర్--డిసెంబర్ నెలలో ఏడ్రియాటిక్ సముద్రంలో అతిపెద్ద అలలు ఏర్పడతాయి. ఆ అలల వలన వచ్చేనీరు వెనిస్ మరియూ చియోజియా నగరాలలోకి వచ్చి నగరాన్ని వరదమయం చేస్తుంది. కొన్ని గంటల తరువాత నీరు తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అలా కనీసం 6 గంటలకొకసారి సముద్రపు నీరు నగరాలలోకి వస్తుంది. ఇలా మూడునెలలు జరుగుతుంది.


1 comment: