Saturday, November 16, 2013

ఎవరెస్ట్ శిఖర అగ్రము చేరుకోవటానికి 5000 మీటర్ల ఎత్తు ఎక్కిన మొదటి కుక్క....ఫోటోలు

ఇల్లులేని, రుపీ అనే పేరుతో పిలువబడే ఒక వీధి కుక్క ఎవరెస్ట్ శిఖర అగ్రమును చేరుకునే దోవలో 5000 మీటర్ల ఎత్తుకు ఎక్కిన మొట్టమొదటి కుక్క అనే పేరు సంపాదించుకుంది. ఈ కుక్కను దత్తతు తీసుకున్న Joanne Lefson అనే ఆమె ఈ కుక్కతో పాటు అక్టోబర్-14 న ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం మొదలుపెట్టింది. 13 రోజులలో ఈ కుక్కతో కలిసి 5000 మీటర్లు ఎక్కి ఎవరెస్ట్ శిఖర మొదటి దిగువ స్థావరము చేరుకుంది.

ఉత్తర భారతదేశములోని లడక్ నగర ప్రాంతములో తిండి దొరకక,జబ్బుతో బాధపడుతున్న ఈ కుక్కను దత్తతు తీసుకుని, వెటెనరీ డాక్టర్ కు చూపించి, వైద్యం చేయించి, తిండి పెట్టి, తనతో ఉంచుకుని, ఆ తరువాత వెటెనరీ డాక్టర్ సలహా తీసుకుని ఈ కుక్కతొ కలిసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం మొదలుపెట్టింది.

"నేను చేసిన ఈ పని వలన ప్రజలలో జంతువులపై, ముఖ్యంగా ఇళ్ళులేని జంతువులపై కనికరం కలిగి వాటి పోషణా బారమును తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ప్రాణికి విలువ ఉంటుందని అందరూ గ్రహించాలి" అని ఆమె తెలిపింది.


No comments:

Post a Comment