Tuesday, November 26, 2013

400 సంవత్సరాలుగా ఎడారిలో ఎండిపోకుండా ఉంటున్న మర్మమైన జమ్మి చెట్టు "ట్రీ ఆఫ్ లైఫ్"....ఫోటోలు

బహ్రయిన్ దేశములోని అస్కర్ మరియూ జా ప్రదేశాలకు మధ్య 32 అడుగుల పోడవుగల ఈ జమ్మిచెట్టు, బ్రతకడమే కష్టమైన ఎడారిలో 400 సంవత్సరాలుగా ఉంటోందట. ఈ చెట్టున్న చుట్టుపక్కల కొన్ని మైళ్ళ దూరంవరకు నీరు గానీ, చెట్లు బ్రతకడానికి కావలసిన ఉద్భిజ్జము గాని లేదట. అందువలనే ఈ జమ్మిచెట్టును మర్మమైన జమ్మిచెట్టుగా, పురాణ ఇతిహాస చెట్టుగా వర్ణించటం జరుగుతోంది.

అయితే మామూలుగానే జమ్మిచెట్టు వేర్లు భూమికి అడుగున 50 మీటర్ల లోతుకు పాకి ఉంటాయట. అలాగే ఈ జమ్మిచెట్టు వేర్లు కూడా 50 మీటర్ల లోతుకు చొచ్చుకుని, భూగర్భ నీటిని తాకే అవకాశం ఉన్నదని, అందులోనూ ఈ చెట్టున్న చోటున భూగర్భ నీరు 9 మీటర్లలోనే ఉంటుందని కొందరుచెబుతున్నారు. అందువలనే ఈ చెట్టు ఇన్ని సంవత్సరాలుగా ఉంటోందని వాదిస్తున్నారు.

ఈ జమ్మి చెట్టును 1583 లో నాటేరని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ చెట్టు ఆరొగ్యంగా, ఏండిపోవడమనే గుర్తులే లేకుండా పచ్చగా ఉన్నదని చెబుతున్నారు. ఈ చెట్టును చూడటానికి సంవత్సరానికి సుమారుగా 50,000 మంది వచ్చివెడతారట.


No comments:

Post a Comment