Tuesday, November 5, 2013

భారత మార్స్ ఆర్పిటర్ మిషన్ (మామ్); పిఎస్ఎల్వీ సి25 లాంచ్ సక్సెస్.... న్యూస్ మరియూ వీడియో


మార్స్ ఆర్పిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహాన్ని మోసుకెళ్తున్న పిఎస్ఎల్వీ సి25 ప్రయోగం విజయవంతమైంది. కీలకమైన నాలుగు దశలు పూర్తి కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.... మామ్ ఉపగ్రహం 24 సెప్టెంబర్ 2014న మార్స్ కక్షలోకి చేరుకుంటుంది. మామ్ సుమారు 35 కోట్ల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సుమారు మూడువారాలపాటు భూకక్ష్యలోనే కొనసాగి, తరువాత అంగారకుడి దిశగా పయనం సాగిస్తుందని శాస్తవ్రేత్తలు చెపుతున్నారు. 300 రోజుల తరువాత అంగారకుడి కక్ష్యలోకి చేరుకోనుంది. సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూమి, అంగారక గ్రహాల మధ్య గమన దూరం రెండేళ్లకో పర్యాయం తక్కువవుతుంది. సరిగ్గా ఆ సందర్భంలోనే ఇస్రో పంపించనున్న ఉపగ్రహం అంగారకుడి గమనంలోకి చేరుకోవడం గమనార్హం. ఇస్రో చేపడుతున్న తొలి గ్రహాంతర ప్రయోగం ఇదే. అంగారక యాత్ర ప్రాజెక్టును రూ.450 కోట్లతో చేపట్టారు. మామ్ తయారీకి రూ.150 కోట్లు, పిఎస్ఎల్వీకి రూ.110 కోట్లు, ఇతరత్రా ఖర్చులకు రూ.190 కోట్లు వ్యయం చేశారు. ఇస్రో చేపడుతున్న తొలి గ్రహాంతర ఉపగ్రహం ఇదే.

అంగారకుడి మీద ఉండే జీవరాసులు తదితరాలు మానవాళికి ఉపయోగపడతాయా? లేదా? ఉపయోగపడితే అవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న అంశంపై మార్స్ మిషన్ను ప్రయోగించేరు.

No comments:

Post a Comment