Saturday, November 30, 2013

శవాల రక్షణకు "సమాధి కంచె":స్కాట్లాండ్ లో వైద్య విధ్యార్ధుల నుండి తమ ప్రియతముల శవాలను బద్రపరుచుకోవడనికి....ఫోటోలు

స్కాట్లాండ్ లో 18 వ శతాబ్ధములోనే వైద్య విద్యార్ధులకోసం శరీర నిర్మాణ శాస్త్రము చదువుకోవడానికి ఒక ప్రత్యేక కళాశాల నిర్మించబడింది. అయితే ఈ విద్యను చదుకోవడానికి కావలసిన ముఖ్యమైన పరికరమైన "దేహం" ఎక్కువగా నిలువలో ఉండేవికావట. మరణ శిక్ష వేయబడ్డ నేరస్తుల దేహాలను పరికరముగా ఉపయోగించుకునేవారట. కానీ ఆ తరువాత ప్రబుత్వ చట్టాలు మార్చడంవలన దేహాలు దొరకక విద్యార్ధులు కష్టపడేవారట. అప్పుడు, విధ్యార్ధులు శ్మశానాలలోకి వెళ్ళి పూడ్చిపెట్టబడిన దేహాలను తవ్వి తీసుకు వచ్చేవారట. ఇది తెలుసుకున్న ప్రజలు ప్రభుత్వంతో మొరపెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం వీరి మొర ఆలకించలేదు. కారణం, వైద్య విద్య పెరుగుదలకు రహస్యంగా తమ అండ చూపడానికి. ఇది గ్రహించిన ప్రజలు, శ్మశానాలలొ చనిపోయి పూడ్చిపెట్టబడిన తమ ప్రియతముల దేహాలను కాపాడుకోవటానికి సమాధుల చుట్టూ ఇనుప కంచెలు కట్టేరట.


అన్య మండలం నుండి నాసా కి ఎస్.ఓ.ఎస్(SOS)సంకేతం వచ్చిందా?......న్యూస్ మరియూ వీడియో


1998 లో నాసా వారికి భూమండల అవతలి నుండి ద్వంసం అవుతున్న ఏదో మరో అన్య మండలం దగ్గరనుండి తమని “ఎలాగైనా కాపాడండి” అనే SOS కాల్ వచ్చినట్లు తెలుపబడుతోంది. అప్పుడే, అప్పుడున్న రెండు పత్రికలలో ఈ సమాచారం ప్రచురించబడింది. కానీ నాసా అధికారులు ఈ విషయాన్ని అప్పుడు ద్రువీకరించలేదు. బహుశ సంకేత పదాలను మన భాష లోకి మార్చుకునే ప్రయత్నం అప్పట్లో సరిగ్గా కుదిరి ఉండకపోవడమే దానికి కారణం అంటున్నారు. కానీ అసలు అక్కడినుండీ, ఎప్పుడూ తమకు సంకేత పదం రానేలేదని నాసా తెలిపింది.

నాసాకు సంకేత పదాలు వచ్చినై అని ప్రచురించిన వార్తా పత్రికలు గొప్ప పత్రికలు కావు కాబట్టి ఈ విషయాన్ని ఎవరూ (మిగితా ప్రపంచ అంతరిక్ష పరిశోధక శాస్త్రవేత్తలు) పట్టించుకోలేదు.


కానీ నాసా వారు ఈ సంకేత పదాలను మన భాషలోకి అనువదించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చివరికి అనువదించేరు. ఆ సంకేతం "మేము నాశనానికి గురౌతున్నాము. మా మండలం భస్మం అవబోతోంది. మేమందరమూ చనిపోబోతున్నాము. మమ్మల్ని కాపాడండి" అనేదేట. ఏ అన్యమండలం నుండి వచ్చిందో గ్రహించుకోలేకపోయేరు.

నాసా వారు ఇన్ని సంవత్సరాలు అన్య మండలం నుండి వచ్చిన సంకేత పదమును అనువదించే పనులలో ఉండటమే ఈ రోజు ఈ విషయం బయటపడటానికి తోడ్పడింది.

మాజీ సోవియట్ యూనియన్ కు చెందిన అతి పెద్ద సైనికాధికారి Dr. Victor Kulakovఈ విషయాన్ని ద్రువీకరిస్తూ ఆ సంకేతం భూమండలానికి దగ్గరలో ఉన్న ఆండ్రోమేడా అనే మండలం నుండి వచ్చిందని, సంకేతంలోని మొదటి మాట "మమ్మల్ని కాపాడండి" అనేది అప్పట్లోనే తెలుసుకోగలిగేరని, కానీ పుర్తి సంకేతం అర్ధం కాలేదని, ఎక్కడి నుం డి వచ్చిందో వెంటనే కనుగొనే టెక్నాలజీ అప్పట్లో మనకి అందుబాటులో లేదని, అయితే ఆ సంకేతాన్ని పంపినవారు అప్పటికే మనకంటే అన్ని విషయాలలోనూ అభివ్రుద్ది చెంది ఉన్నారని, బహుశ న్యూక్లియర్ అణు అపదే వారి మండల నాశనానికి కారణమని తెలిపేరు. నేను మాత్రం అప్పట్లో ఏ పత్రికకూ ఈ విషయం తెలుపలేదని చెప్పేరు.


ఇప్పుడు కూడా నాసా ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచింది.

రాళ్ళబండి కవితా ప్రశాద్ గారి జ్ఞానము పెంచే అద్భుత ప్రసంగం....వీడియో


రంగులు మీ గురించి ఏమి చెబుతున్నాయి....ఫోటోలు
Friday, November 29, 2013

బ్రెజిల్ దేశములోని అపూర్వమైన, అందమైన క్రియేటివ్ టెలిఫోన్ బూత్....ఫోటోలు


కొన్ని కంపెనీల గుర్తులు(చిహ్నము), వాటి అర్ధాలు.....ఫోటోలు

ఈ చిహ్నములో ఏరో గుర్తు ఎందుకో చాలామందికి తెలియదు. కానీ అది ఏమి సూచిస్తోందంటే అమజాన్ డాట్ కాం లో A టు Z వరకు అన్నీ దొరుకుతాయని, మరియూ ఈ కంపెనీలొ వస్తువులు కొంటే అందరి మొహంలో చిరునవ్వు తప్పక ఉంటుందని దాని అర్ధం.
ఈ కంపెనీ చిహ్నములో కం పెనీ పేరు మీద 3 గీతలున్నాయి. అది అతి ఎత్తైన కొండను సూచిస్తూ సవాలు ను సులువుగా చేరుకోవచ్చు అని సూచిస్తుంది.
బైబిల్ లోని ఆడం మరియూ ఈవ్ కధను సూచిస్తూ, జ్ఞానము అనే చెట్టు యొక్క పండును చూపిస్తూ, ఆ పండును కొరికి తినే కొద్దీ, ప్రతి కొరుకుడులోనూ జ్ఞానము దొరుకుతుందని సూచిస్తోంది.
ఈ చిహ్నములోని నక్షత్రములో 3 చివర్లు భూమి,గాలి మరియూ నీరు ను సూచిస్తూ, ఈ మూడు చోట్ల తమ ఆధిక్యత ఉన్నదని తెలుపుతుంది.
ఈ కంపెనీ గుర్తులో E కు X కు మధ్య ఒక ఏరో కనబడుతుంది. ఎంతమంది గుర్తించేరో తెలియదు. కానీ ఇప్పుడు మరోమారు చూస్తే మీరూ గుర్తిస్తారు. ఆ ఏరో గుర్తు వేగమునూ, ఖచ్చితమైన సమయమును సూచిస్తూ, అదే విధముగా తమ సేవలు ఉంటాయని తెలుపుతోంది.
ఇది ప్రపంచములోనే అతిపెద్ద టీవీ నెట్ వర్క్. ఈ చిహ్నములో అక్షరాలపై నెమలి గుర్తు కనబడుతుంది. అవి నెమలి ఈకలలోని 6 రకాల ఈకలు. ఈ గుర్తును ముద్రించేటప్పుడు 6 కార్యవిధులు ఉండేవట. వాటిని సూచిస్తూ, నెమలి గుర్తులో ఒక ఈకలో ఎప్పుడూ ముందుకూ పోతూనే ఉంటామనే సూచన ఉన్నది.
ఈ చిహ్నము చూసిన వెంటనే లాప్ టాప్లు గుర్తుకు వస్తాయి. కానీ సొనీ అనే పేరు క్రింద ఉన్న వియో లో ఒక అర్ధమున్నది. మొదటి 2 అక్షరాలూ ప్రధానమైన అనలాగ్ సూత్రం. మిగిలిన 2 అక్షరాలూ (పది అంకెలాగా కనబడతాయి) డిజిటల్ సూచికలు.
యూనీ లీవర్ తయారుచేయని వస్తువులేదు. మనం రోజులో ఒక సారి వీరి తయారుచెసిన ఉత్పత్తిని వాడే తీరుతాము. సబ్బు, టూత్ పేస్ట్, క్లీనింగ్ పౌడర్లూ, ఆరొగ్య పానీయములూ....ఇలా ఏవో ఒకటి తప్పక వాడతాము. వారి కంపెనీ లోగో గుర్తులో ఎన్నో బొమ్మలు ఉన్నాయి.ఇవి మనకి ఎన్నో సూచనలిస్తాయి. ఉదాహరణకు గుండె గుర్తు ప్రేమ,శ్రద్ధ ను సూచిస్తాయి. పక్షి స్వతంత్రత ను మరియూ రోజూ పడే భాదలనుండి విముక్తి ని సూచిస్తుంది.
ఈ కంపెనీ యొక్క 1981 గుర్తులో కళ్ళు,తేనెటీగ మరీ M ఉన్నాయి. ఇవన్నీ (కళ్ళ) విశ్రాంతి కి సూచనలు.
ఈ చిహ్నములో సమతౌల్యము సూచన ఉంటుంది. SUN లోని U మరియూ N డిజైన్లు కలిపితే తిరిగి మొదటి అక్షరము S వస్తుంది.