Thursday, October 10, 2013

నూతన పోరాటం: వీధి లో బంగారు నాణాలతో బాట వేసిన స్విజర్లాండ్ పౌరులు....ఫోటోలు

కొన్ని వందల సంవత్సరాల వరకు యూరప్ లోనే డబ్బుగల దేశమనే పేరున్నది స్విజర్లాండ్. ఈ క్రింది ఫోటోలను చూస్తే అది నిజమేననిపిస్తోంది. ఎందుకంటే ఎంతో డబ్బుంటేగానీ బంగారు కాసులను రోడ్డుమీద పరచడానికి సాహసించరు. దేశములోని ప్రతి ఇంట్లోని వారూ 5 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన బంగారు నాణెం ను ఉద్యమ నాయకులకు అందించేరు. దీనికి కారణం. ప్రతి ఇంటికీ కనీస వేతనం కావాలని, దానికి కావలసిన పరిస్తితులు ప్రభుత్వం ఏర్పరచాలని ప్రభుత్వానికి తెలియజేయడానికేనట.

ఒక్కొక్కరూ అందించిన బంగారు నాణాలను ఉద్యమ నాయకులు ఒక బ్యాంకు లాకరులో ఉంచేరు. మొత్తం 8 మిల్లియన్ల నాణాలు పోగయ్యేయి. ఈ మొత్త నాణాల బరువు 15 టన్నులు. ఈ మొత్త నాణాలను రోడ్డుమీద పరచబోతామని ఉద్యమ నాయకులు స్విజర్లాండ్ పార్లమెంట్లో తెలిపి, వాటిని స్విజర్లాండ్ పార్లమెంట్ ముందు కుమ్మరించి బంగారు బాట వేసేరు. ఈ నెల 4 వ తారీఖున ఈ పోరాటం చేసేరు.


No comments:

Post a Comment