Tuesday, October 15, 2013

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా దౌండియా ఖేరా గ్రామంలో భారీ స్థాయిలో బంగారం నిధి! ....ఫోటోలు

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా దౌండియా ఖేరా గ్రామంలో భారీ స్థాయిలో బంగారం నిధి ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆ నిధిలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నట్లు చెబుతున్నారు.

దౌండియా ఖేరా గ్రామంలో 180 ఏళ్ల క్రితం రాజా రామ్‌భక్ష్‌ సింగ్‌ శివాలయం నిర్మించారు. ఆ ఆలయం అడుగున వెయ్యి టన్నుల బంగారం నిధి ఉందని ఈ ప్రాంతానికి చెందిన స్వామి శోభన్‌ సర్కారు చెబుతున్నారు. ఇక్కడ నిధిని వెలికితీయాలని ఆయన ప్రధానికి, రిజర్వ్‌ బ్యాంకుకు లేఖలు కూడా రాశారు. ఉన్నావ్‌ ప్రాంతంలో స్వామి శోభన్‌ సర్కారుకు మంచి పేరుంది. ఆయన సత్యమే మాట్లాడాతారని ప్రతీతి. అందుకే అక్కడివారు ఆయన మాటలు నమ్ముతున్నారు. పురావస్తు శాఖ కూడా ఆయన మాటలు నమ్మి ఈ ఊళ్లో తవ్వకాలు చేపట్టింది. ఒక చోట తవ్వితే శబ్దం వేరువిధంగా ఉన్నట్లు గుర్తించారు. పూర్తిస్థాయిలో అక్కడ తవ్వకాలను ఈ నెల 18 నుంచి చేపట్టనున్నారు. ఈ నిధి చుట్లూ రాజు ఆత్మ తిరుగుతోందని స్వామి అంటున్నారు. తనకు విముక్తి కల్పించాలని ఆ ఆత్మ కోరుతున్నట్లు స్వామీజీ చెప్తున్నారు. బంగారం నిధి ఉందని తెలియడంతో ఎక్కడెక్కడో ఉంటున్న దౌండియా ఖేరా గ్రామస్తులు ఇప్పుడు ఊరికి చేరుకుంటున్నారు.

ఆలయానికి వెడుతున్న ప్రజలు
ఈ ఆలయం దగ్గరే తవ్వకాలు
స్వామి సోభన్ సర్కార్
180 సంవత్సరాల గుడి లోని ఒక భాగం
గుడిలో ప్రార్ధన చేస్తున్న భక్తులు

ఫోటో క్రెడిట్:http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2459852/Gold-rush-hits-Uttar-Pradesh-Archaeologists-drill-buried-treasure-godman-dreams-1-000-tonnes-gold-hidden-beneath-abandoned-palace.html?ito=feeds-newsxml

No comments:

Post a Comment