Thursday, October 24, 2013

కీటకాల(చాక్లెట్)మిఠాయి....ఫోటోలు

ఫ్రాన్స్ దేశంలోని చాక్లెట్లు తయారుచేసే సిల్వియన్ ముస్కర్ అనే కంపెనీ అసాదరణమైన చాక్లెట్లను తయారుచేస్తోంది. ఈ చాక్లెట్ల ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి చాక్లెట్ పైన బంగారు పూత పూసిన కీటకాలను ఉంచుతారు. 9 చాక్లెట్లు కలిగిన ఒక ప్యాకెట్ 1500 రూపాయలు. ఈ మధ్య యూనైటడ్ నేషన్స్ విడుదలచేసిన ఒక ప్రకటనలో కీటకాలను తింటే బరువు తగ్గుతారనీ, కీటకాలలో అత్యంత శక్తివంతమైన ప్రోటీన్ ఉన్నదని తెలిపేరు. ఆరొగ్యానికి ఇది చాలా మంచిదని చెప్పడంతో ప్రపంచంలో కీటకాలను తినడం ఎక్కువ అయ్యింది. అందుకే ఈ చాక్లెట్లను తాయారుచేసింది ఈ కంపెనీ.


No comments:

Post a Comment