Monday, October 7, 2013

జంతువులను శిలలుగా మార్చే సరస్సు....ఫోటోలు

టాంజినియాలోని లోతులేని నాట్రాన్ సరస్సు గురించి చాలా జంతువులకు తెలుసనుకుంటా, అందుకే అవి ఆ సరస్సును తప్పించుకుంటాయి. ఈ సరస్సులులోని నీరు 120 డిగ్రీల ఫారెన్ హీట్ వేడి కలిగి ఉంటుందట. ఈ సరస్సులో సహజమైన రీతిలో సోడియం కార్బనేట్ చేరుతుందట. ఇది చాలా విషపూరితమైనదట. ఇది తెలుసుకోలేని కొన్ని జంతువులు ఆ సరస్సులో ఆహారంకోసం దిగటం, ఆ సరస్సులోని విషపూరిత సోడియం కార్బనేట్ లో చిక్కుకోవడం, దాని వలన చనిపోయి శిలలాగా మరిపోవడం జరుగుతోందట.

నిక్ బ్రాండిట్ అనే ఒక ఫోటోగ్రాఫర్ ఈ సరస్సులోకి వచ్చే జంతువులను చిత్రీకరించడానికి వచ్చినప్పుడు చనిపోయి, శిలలుగా ఉన్న ఈ జంతువులను చూసి ఆశ్చర్యపోయేడట. ఎందుకలా జరుగుతోందో తెలుసుకున్న ఆ ఫోటోగ్రాఫర్ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ అక్కడ శిలా రూపమైన కొన్ని జంతువులను ఫోటోలు తీసి పత్రికలకు పంపించేడట.


ఫోటోలు:నిక్ బ్రాండిట్

2 comments:

  1. Here is the full story http://meeandarikosam.blogspot.com/2013/10/blog-post_7.html

    ReplyDelete
    Replies
    1. Wrong link in previous post. The correct link:http://news.nationalgeographic.com/news/2013/10/pictures/131003-calcified-birds-bats-africa-lake-natron-tanzania-animals-science/

      Delete