Thursday, October 24, 2013

నార్వే దేశ ద్వీపంలో ఏర్పరచిన ప్రపంచ ఆహార విత్తనాల పేటిక.....ఫోటోలు

అపాయకరమైన జంతువుల, అరుదుగా కనబడే జంతువుల జాతులు అంతరించిపోతున్నాయనే విషయం మనమంతా వినే ఉంటాము. మనుష్యులకు ఉపయోగపడే మొక్కలు కూడా అంతరించిపోతున్నాయనే భయం కూడా మొదలైంది. కొన్ని శతాబ్ధాలుగా పండిస్తున్న పండ్లు మరియూ కూరగాయల రకాలు కూడా అంతరించిపోతున్నాయట. ఈ మధ్య అమెరికాలో జరిపిన ఒక పరిశోధనలో 1903 లో 8,000 రకాల పంటలు ఉండేవి, కానీ ఇప్పుడు 600 రకాల పంటలు మాత్రమే ఉన్నాయని తెలిసింది. ఒక వేల ప్రపంచంలో ఎక్కడైనా న్యూక్లియర్ యుద్దం జరిగితే, లేక వాతావరణ మార్పిడివలనో లేక నక్షత్ర శకలం వలనో గానీ భూమికి విపత్తు ఏర్పడితే మానవాలి తిరిగి ఎలా నాగరికతను ఏర్పరచుకోవాలి?....దీనికి పరిష్కారమే ఆహార విత్తనాల పేటిక.


ఉత్తర దృవం కు 1300 కిలోమీటర్ల దూరంలో నార్వేదేశ ద్వీపంలో భూగర్భ గుహ ను నిర్మించేరు. అదే స్వల్ బర్డ్ ప్రపంచ ఆహార విత్తనాల పేటిక. ఈ పేటికలో 4.5 మిల్లియన్ రకాల ఆహార విత్తనాలను దాచుకోవచ్చు. ఒక వేల భూమికేగనుక ఎలాంటి మహావిపత్తు ఏర్పడి పంటలు అంతరించిపోతే తిరిగి ఈ విత్తనాల పేటిక నుండి విత్తనాలు తీసుకుని పంటలు పండించుకోవచ్చు.....2008 లో ఉపయోగానికి వచ్చిన ఈ ప్రపంచ ఆహార విత్తనాల పేటికలో 4 లక్షల ఆహార విత్తనాల రకాలను అమెరికా, కెనడా, స్విజర్లాండ్, కొలంబియా, మెక్సికో మరియూ సిరియా దేశాలు దాచినై. మార్చ్ 2013 కు ఈ సంఖ్య 7 లక్షల డెబ్బై వేలకు పెరిగింది.


క్రెడిట్ మరియూ సోర్స్: Wikipedia, BBC, Wired.

No comments:

Post a Comment