Saturday, October 26, 2013

అంగారక గ్రహంలో నివాశాం ఏర్పరుచుకోవాలనుకుంటున్న వారు.....ఇన్ ఫో గ్రాఫ్

కుజుఁడు (ఆంగ్లం : MARS), దీనికి 'ఎర్ర గ్రహం' (Red Planet) అని కూడా పేరు కలదు. నవగ్రహాలలో ఒక గ్రహం పేరు. ప్రస్తుతం ఎనిమిది గ్రహాలున్నవని అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ప్రకటించింది.

కుజుఁడు యొక్క పుట్టుక గుఱించి హిందూ పురాణాల్లో మూడు కథలు వాడుకలో ఉన్నాయి. భూదేవికి విష్ణుమూర్తికి పుట్టిన కొడుకే కుజుఁడు అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. ఒకసారి, నేల మీఁద పడ్డ విష్ణువు యొక్క చెమట బొట్టు నుండి ఒక పురుషుడు పుట్టాడు. అతను తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఒక గ్రహంగా మారాడు.

ఆ గ్రహమే 'కుజ గ్రహం' అని పద్మ పురాణం చెబుతుంది. దాక్షాయణి దూరమైన ఎడబాటులో ఉన్న శివుడి శరీరం లోంచి రాలిన ఓ చెమట బొట్టు నుండి ఒక పురుషుడు పుడితే, భూదేవి అతన్ని తన సొంత కొడుకుఁగా చేరదీసిందనీ, అతనే కుజుఁడని మరో కథ కూడా నానుడిలో ఉంది.

Mars Mission
Explore more infographics like this one on the web's largest information design community - Visually.

No comments:

Post a Comment