Saturday, October 12, 2013

కొబ్బరికాయల గురించిన నిజాలు....ఫోటోలు

కొబ్బరిని ఆహార అదనం, ఆరోగ్య పానము, ఆహారంలో ఒక పధార్ధముగానే తెలుసు. ఇవే కాకుండా కొబ్బరి "జీవితానికే ఒక పండు" గా చెప్పబడే వాటి గురించి కూడా తెలుసుకుందాము.

The Coconut IV.....కొబ్బరి వలన ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని అందరికీ తెలుసు. వీటి గురించి ఎన్నో హెల్త్ మరియూ మెడికల్ పత్రికలలో రాసేరు. కానీ కొబ్బరి నీళ్ళు నరాలలోకి ఎక్కిస్తే అది కొద్దిసేపటివరకు బ్లడ్ ప్లాస్మా గా పనిచేస్తుందని 1950 లో సోలమన్ ద్వీపంలో ఒక డి-హైడ్రేటడ్ పేషెంటుకు ఎక్కించినట్లు పత్రాలు ఉన్నాయి.
Used In World War I Gas Masks.....మొదటి ప్రపంచ యుద్దంలో రసాయణ ఆయుధాలు ఎక్కువగా ఉపయోగించేరు. అందువలన గ్యాస్ మాస్క్ ఖచ్చితంగా ఉపయోగించవలసివచ్చింది. ఎన్నో రకాల మాస్కులు తయారుచేసేరు. కానీ అవి పూర్తిగా సైనికులను రక్షించలేకపోయినై. అప్పుడు కొబ్బరి నారను, తగలబెట్టి అందులోనుండి వెలువడిన పొడిని చేర్చి తయారుచేసిన మాస్క్ అత్యంత రక్షణ ఇచ్చింది.
Trained Coconut Monkeys.....కొబ్బరి కాయలనుకోయడానికి కోతులకు ట్రైనింగ్ ఇచ్చి, వాతి చేత పొడుగైన చెట్లలో కాచిన కొబ్బరికాయలను కోయించేవారట.
The Coconut Palace......కొబ్బరి తినడానికి మాత్రమే కాకుండా కట్టడాలు కట్టడానికికూడా ఉపయోగపడుతుందని ఫిలిపైన్స్ ప్రెశిడెంట్ Fఎర్దినంద్ ంఅర్చొస్ కొబ్బరిచెట్టు దూలాలతో రాజభవనం కట్టించేడు. ఈ కొబ్బరి భవనానికిగానూ 10 మిల్లియన్ డాలర్లను ఖర్చు చేసేడు.
The Art Of The Coconut.....కొబ్బరికాయలతో కళ. పిలిపైన్స్ దేశంలో ఎక్కువగా ఈ కళ కనబడుతుంది.
Coco-Fuel....కొబ్బరి ఆరోగ్యానికి మాత్రమే ఎనర్జీ కాదు, అది ఈ భూమండలంలోని మిషెన్లకు స్నేహపూరిత ఎనర్జీ. బయో డీజల్ వినే ఉంటారు. రాబోవు కాలంలో పెట్రోలుకు బదులు బయో డీజల్ ఉపయోగిస్తారు. కానీ కొబ్బరి నుండి తీయగలిగే ఒక రసాయణం పెట్రోల్ కు బదులు వాడుకోవచ్చునట. ఇదేమంత ఆశ్చర్యపడే విషయం కాదు. ఎందుకంటే పూర్వం వేరుసెనగ నూనెతో ఇంజిన్లు నడిపేవారు.
Coconut Armor.....పూర్వం యుద్దాలలో కొబ్బరి నారతో చేసిన హెల్మెట్లను వాడేవారు. కానీ పసిఫిక్ మహాసముద్రం లోని అతిచిన్న దీవి అయిన కిరిబటి కొబ్బరినారతో పూర్తి మిలటరీ సూటు చేయించుకున్నారట.

No comments:

Post a Comment