Friday, October 11, 2013

ఆక్టోపస్ లాగా ఉండే ఫంగస్(శిలీంద్రం)....ఫోటోలు

శిలీంధ్రాలు (ఆంగ్లం: Fungus) ఒక రకమైన సూక్ష్మక్రిములు. ఇవి మట్టిలో విరివిగా ఉంటాయి. వీటిలో 70,000 రకాలు గుర్తించబడ్డాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా మొక్కలలో, జంతువులలో మరియు మానవులలో వివిధరకాలైన వ్యాధులు కలుగజేస్తాయి. కొన్ని ప్రాణాంతకముగా మారే అవకాశం ఉంది. శిలీంధ్రాల గురించి తెలియజేసే విజ్ఞానాన్ని 'మైకాలజీ' అంటారు.

శిలీంధ్రాలు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. ఇవి గాలిలో, నీటిలో, నేలపై మరియు నేలలోను, సజీవ నిర్జీవ దేహలలో ఉంటాయి. అత్యధిక జాతులు కుళ్ళుచున్న సేంద్రీయ పదార్థాలపై పూతికాహారులు (Saprophytes) జీవిస్తున్నాయి. నీటిలో నివసించే శిలీంధ్రాలు ఆదిమమైనవి. వీటికన్నా పరిణతి చెందినవి మృత్తికావాసం చేసేవి. వీటికన్నా పరిణతి చెందినవి పరాన్నజీవులు. కొన్ని జంతువుల, వృక్షాల దేహాలలో పరాన్నజీవులు ((Parasites) గా వివిధ వ్యాధులను కలుగజేస్తున్నాయి.

కొన్ని శిలీంధ్ర ప్రజాతులు వృక్షాల వేరు వ్యవస్థలలో శిలీంధ్ర మూలాలు (Mycorrhiza) గా ఏర్పడి సహజీవనం చేస్తూ, నీరు, లవణ పోషణకు ఉపకరిస్తాయి. చాలా వృక్ష జాతులు (90% పైగా) వాని మనుగడకు ఈ విధంగా శిలీంధ్రాలపై ఆధారపడిఉంటాయి. ఈ విధమైన సహజీవనం మానవులకు చాలా ప్రాచీన కాలం అనగా ఇంచుమించు 400 మిలియను సంవత్సరాల నుండి తెలుసును. ఇవి మొక్కలు నత్రజని మరియు ఫాస్ఫేటు లను భూమి నుండి పీల్చుకోవడాన్ని అధికం చేస్తాయి. కొన్ని శిలీంధ్రాలు ఒక మొక్క నుంచి మరొక మొక్కకు పిండి పదార్ధాలు మొదలైన ఆహార పదార్ధాలను తరలిస్తాయి.

ఈ శిలీంద్రం ను Clathrus archeri అంటారు.


No comments:

Post a Comment